ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌పై వస్తున్న వార్తలపై భారతీయ రైల్వే శాఖ Indian railways క్లారిటీ ఇచ్చింది. పర్సనల్ ఐడీతో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష, జరిమానా పడుతుందని వార్తలు వచ్చాయి.
భారతీయ రైల్వే
న్యూఢిల్లీ, ఈవార్తలు : ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌పై వస్తున్న వార్తలపై భారతీయ రైల్వే శాఖ Indian railways క్లారిటీ ఇచ్చింది. పర్సనల్ ఐడీతో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష, జరిమానా పడుతుందని వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అసత్యమని, ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని వెల్లడించింది. పర్సనల్ ఐడీతో కుటుంబసభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఆన్‌లైన్‌లో టికెట్ online ticket బుక్ చేసుకోవచ్చని వివరణ ఇచ్చింది. ఆధార్ aadhar అనుసంధానం అయ్యి ఉంటే ఒక ఐడీతో నెలకు 24 టికెట్లు, ఆధార్ అనుసంధానం లేకపోతే నెలకు 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే, వ్యక్తిగత ఐడీల ద్వారా చేసే టికెట్ బుకింగ్ వాణిజ్య అవసరాల కోసం ఏర్పాటు చేసింది కాదని, అందుకే వాణిజ్యపరమైన వాటికి ఉపయోగిస్తే చర్యలు తప్పవని క్లారిటీ ఇచ్చింది.
ఒకే ఇంటి పేరు ఉన్నవారు, రక్తసంబంధీకులు మాత్రమే టికెట్ బుక్ చేసుకోవచ్చన్న వార్తలపైనా స్పష్టత ఇచ్చింది. ఒకే ఇంటిపేరు లేకున్నా.. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు అయితే ఆన్‌లైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. పర్సనల్ ఐడీ ద్వారా టికెట్ల విక్రయం జరిపితే మాత్రం నేరమే అని వివరించింది. ఏజెంట్లు మాత్రమే ఇతరులకు టికెట్ విక్రయించే అధికారాన్ని కలిగి ఉంటాయని తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.