పాతాళానికి పడిపోతున్న రూపాయి.. చర్యలు తీసుకోని కేంద్ర ప్రభుత్వం

రోజురోజుకు రూపాయి విలువ పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మన ఆర్థిక వ్యవస్థ బలంగా లేదనడానికి ఇంతకన్నానిదర్శనం అక్కర్లేదు. గత కొన్ని మాసాలుగా రూపాయి పతనం వల్ల దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

rupee fall down

ప్రతీకాత్మక చిత్రం

దేశీయంగా వృద్ది తగ్గడం మారకంపై తీవ్రంగా పడుతోంది. అమెనికా దూకుడు విధానాలు, భారత్‌ లక్ష్యంగా విపరీతంగా టారిఫ్‌లు విధించడంతో అంతర్‌ఆజతీయంగా భారత్‌ మార్కెట్లు కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. మన ఎగుమతలుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా తీరు భారత్కు పరీక్షా మారింది. చైనా ఎదురుదాడితో కొంత మేరకు దిగి వచ్చిన ట్రంప్‌ భారత్‌ విషయంలో మంకుపట్టుతో ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇటీవలి పాక్‌తో కాల్పుల తరవాత ట్రంప్‌ తీరులో మార్పు మరీ విపరీతంగా ఉంది. రోణ రంగంలో భారత్‌ ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. భారత్‌ను ఇరుకున పెట్టే చర్యలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. భారత్‌తో సంబంధాలు, వాణిజ్యం విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలను కలిగిస్తున్నది. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి పలు వ్యతిరేక నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. ట్రేడ్‌ టారిఫ్‌లు, ఇటీవల భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులలో ఆయన వ్యవహరించిన తీరు, కాశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వంపై ప్రతిపాదన తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. అరబ్‌ దేశాల పర్యటనలో ఉన్న ట్రంప్‌.. విదేశీ గడ్డపై మాట్లాడుతూ భారత్‌లో యాపిల్‌ కంపెనీ కార్యకలాపాలపై అసంతృప్తి వెళ్లగక్కిన తీరు కూడా ఆందోళనను, అనుమానాలను రేకెత్తించింది.

ఈ క్రమంలో రోజురోజుకు రూపాయి విలువ పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మన ఆర్థిక వ్యవస్థ బలంగా లేదనడానికి ఇంతకన్నానిదర్శనం అక్కర్లేదు. గత కొన్ని మాసాలుగా రూపాయి పతనం వల్ల దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అలాగే విదేశీ మారక నిల్వలపై కూడా ప్రభావం పడుతోంది. రూపాయిని నిలబెట్టే చర్యలేవీ ప్రభుత్వం తీసుకోవడం లేదు. దీంతో ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి, పేదలకు శరాఘాతంగా పరిణమిస్తోంది. డాలర్‌కు రూ.85.50 మధ్య మారకపు రేటు కొనసాగుతోంది. తాజాగా 86కు చేరువలో ఉంది.రిజర్వుబ్యాంక్‌ దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలను మార్కెట్‌ లోకి అదనంగా విడుదల చేసినప్పటికీ, రూపాయి విలువ పతనం ఆగడంలేదు. ఇబ్బడిముబ్బడిగా దిగుమతులు కూడా ఓ కారణంగా చెప్పుకోవాలి. అలాగే జిఎస్టీ పోటుతో దేశీయంగా ధరలు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. దీనిని తగ్గించాలన్న డిమాండ్‌ను పట్టించు కోవడం లేదు.

ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచే చర్యలేవీ చేయడం లేదు. రూపాయి విలువ డాలర్‌తో పోల్చుకున్నప్పుడు అతి తక్కువకు పడిపోయింది. విదేశీ మారకద్రవ్యాన్ని వివిధ కరెన్సీలలో దాచుకుంటారు. ఆ విధంగా కొంత యూరోల రూపంలో దాచినది ఉంది. యూరో విలువ కూడా డాలర్‌ తో పోల్చినప్పుడు తగ్గింది. ఆ విధంగా కూడా మన విదేశీ కరెన్సీ నిల్వల విలువ డాలర్‌తో పోల్చి నప్పుడు తగ్గింది. రూపాయి విలువ పడిపోకుండా నిలబెట్టడానికి ఆర్‌బిఐ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా కూడా రూపాయి విలువ పడిపోతోంది. రూపాయి విలువ పడిపోవడం అనేది సామాన్యులకు భారంగా మారింది. దేశీయంగా కఠినచర్యలు తీసుకుంటే ఈ దుస్థితిరాదు. రూపాయి విలువ పడిపోవడం కారణంగా పెట్రో దిగుమతులకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. దాని వలన పెట్రోలు డీజిల, వంటగ్యాస్‌ ధరలు మరింత పెరుగుతున్నాయి. అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది.

ఈ ద్రవ్యోల్బణం విదేశీ మార్కెట్‌లో రూపాయి విలువ మరింత పడిపోడానికి దారి తీస్తుంది. ఆ విధంగా ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి విలువ పతనం అన్న చక్ర భ్రమణం సాగుతోంది. రూపాయి విలువ పడిపోవడం కారణంగా మన దిగుమతులు మరింత ప్రియం అవుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమనే ప్రహసనం చివరికు ప్రజల కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విదేశీ విద్య మరింత భారం అవుతోంది. విదేశీ ప్రయాణాలు కూడా భారంగా మారుతున్నాయి. మొత్తంగా రూపాయి విలువ పడిపోవడం అనేది ప్రజల విూద మరింత పెద్ద దాడిగా పరిణమిస్తుంది. ఒకవేళ ఏదైనా తాత్కాలిక పరిణామం కారణంగా రూపాయి విలువ పడిపోతే, తిరిగి కొద్దికాలంలోనే మళ్ళీ కోలుకుని పెరిగే అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుతం రూపాయి విలువ పతనానికి కారణాలు వ్యవస్థీకృతమైనవిగా భావించాలి. విదేశీ చెల్లింపుల లోటు పెరిగిపోడానికి కారణం విదేశీ వ్యాపారంలో ఎగుమతులకన్నా దిగుమతుల విలువ ఎక్కువగా ఉండడం అని గుర్తించాలి. మన ఎగుమతులు పెరుగుతున్న వేగంతో పోల్చినప్పుడు దిగుమతులు ఇంకా వేగంగా పెరిగి పోతున్నాయి.

అయితే దీనిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం తప్ప రూపాయి బలోపేతనాకి తీసుకుంటున్న చర్యలు కానరావడం లేదు. గత ఆర్థిక సంవత్సరం 2024-25 జనవరి- మార్చి తైమ్రాసికంలో భారత జీడీపీ వృద్ధి 6.9 శాతంగా నమోదు కావొచ్చని ఇక్రా అంచనా వేసింది. 2024-25 మొత్తం విూద వృద్ధి 6.3 శాతంగా ఉండనుందని పేర్కొంది. ఫిబ్రవరిలో జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) అంచనా వేసిన 6.5 శాతం కంటే ఇది తక్కువ. జూన్‌, సెప్టెంబరు, డిసెంబరు తైమ్రాసికాల్లో వృద్ధి వరుసగా 6.5 శాతం, 5.6 శాతం, 6.2 శాతంగా నమోదైంది. 2024-25లో ఎన్‌ఎస్‌ఓ వృద్ధి అంచనా 6.5 శాతాన్ని అందుకోవాలంటే, నాలుగో త్రైమాసికంలో 7.6 శాతం వృద్ధిని సాధించాల్సి ఉంది.

మే 30న 2024-25 నాలుగో తైమ్రాసికంతో పాటు పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ గణాంకాలను ఎన్‌ఎస్‌ఓ ప్రకటించనుంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు తైమ్రాసికాల్లో వృద్ధి గణాంకాల్లో సవరింపులు ఉంటే తప్పా, వృద్ధి  6.3 శాతానికి పడిపోనుంది. 2023-24లో జీడీపీ వృద్ధి 9.2 శాతంగా నమోదైంది. నాలుగో త్రైమాసికంలో ప్రైవేట్‌ వినియోగం, పెట్టుబడుల ధోరణులు సరిగ్గా లేవని, టారిఫ్‌ సంబంధిత అనిశ్చితులు ఇందుకు తోడయ్యాయని ఆర్థికవేత్తలు తెలిపారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్