భారత సైన్యాన్ని విపక్ష ఇండీ కూటమి రాజకీయ సాధనంగా వాడుకుంటోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఇంతకంటే పెద్ద పాపం ఏదైనా ఉంటుందా..? అని ఆయన ప్రశ్నించారు. చివరి దశ పోలింగ్ జరగనున్న పంజాబ్ లోని పలు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించిన ఆయన ఇండీ కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోదీ
భారత సైన్యాన్ని విపక్ష ఇండీ కూటమి రాజకీయ సాధనంగా వాడుకుంటోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఇంతకంటే పెద్ద పాపం ఏదైనా ఉంటుందా..? అని ఆయన ప్రశ్నించారు. చివరి దశ పోలింగ్ జరగనున్న పంజాబ్ లోని పలు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించిన ఆయన ఇండీ కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ, ఇండీ కూటమిపై విరుచుకుపడ్డారు. భారత సైన్యాన్ని బలహీనపరిచేందుకు అవి చేయని ప్రయత్నాలు లేవని వెల్లడించారు. రిపబ్లిక్ దినోత్సవ పరేడ్ లో పాల్గొనేందుకు సైన్యాన్ని తయారు చేయలేదని ఆరోపించారు. ఆర్మీ ఉన్నది శత్రువుతో పోరాడి ఓడించడానికేనని, మాతృ భూమిని రక్షించడానికేనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 'ఇండీ కూటమికి ఒకటే చెబుతున్న ఇప్పుడు నేను మౌనంగా ఉన్నాను. నేను నోరు తెరిచానంటే ఏడు తరాల పాపాలు బయటపెడతా' అని హెచ్చరించారు. పంజాబ్ వీర భూమి అని, ఇండి కూటమి ఆ వీరులను ప్రతిసారి అవమానిస్తోందన్నారు. దివంగత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను కాంగ్రెస్ గల్లి గూండా అని విమర్శించిందని, ఇది ఆయననే కాదు ప్రతి సైనికుడిని అవమానించినట్లేనని ఆరోపించారు. సర్జికల్ దాడికి రుజువులు అడిగారని, 1962 యుద్ధంలో చైనా కు క్లీన్ చీట్ ఇచ్చారని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రతిరోజూ భారత సైన్యాన్ని కించపరుస్తున్నారని అంటూ ప్రధాని మోదీ ఆరోపించారు. తేజస్ ఫైటర్ల పథకాన్ని కాంగ్రెస్ అటకెక్కించిందని, రక్షణ దళాల చీఫ్ పదవిని పదేళ్లపాటు నియమించకుండా నాన్చారని విమర్శించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పై 40 ఏళ్లపాటు కాంగ్రెస్ అబద్ధాలు ఆడిందని, తన ప్రభుత్వం వచ్చాకే దీన్ని అమలు చేసినట్లు ప్రధాన మోదీ వెల్లడించారు. రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్, ఇండీ కూటమి ఉద్దేశాలు ప్రమాదకరమైన ప్రధాని హెచ్చరించారు. దళితులు, బలహీనవర్గాల నుంచి రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ స్పూర్తిని, అంబేద్కర్ మనోభావాలను ఆ పార్టీలు అవమానించాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, క్రీడలు, టెండర్లు, యూనివర్సిటీ ప్రవేశాల్లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కావాలని అవి కోరుతున్నాయని ప్రధాని ఆరోపించారు. దేశాన్ని విభజించేందుకు వీటిని అతి పెద్ద కుట్రగా ఆయన అభివర్ణించారు. ఆమ్ ఆద్మీ పార్టీపైన ప్రధాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ కఠోర అవినీతిమయమైన పార్టీ అని, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి డ్రామాలాడుతుందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే ఆప్ తొలిసారి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఎలా అవినీతి చేయాలో ఆ పార్టీ నుంచి నేర్చుకుందని, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిందని, పంజాబ్ లో డ్రగ్స్ నిర్మూలిస్తామని హామీ ఇచ్చి గద్దినెక్కిన ఆప్, ఆ తర్వాత దానినే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుందని ప్రధాన మోదీ విమర్శించారు.