ముస్లిం ఓట్ల కోసం ఇండియా కూటమి ముజ్రా డాన్స్.. ప్రధాని వ్యాఖ్యలు

ఇండియా కూటమిపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించారు. ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఇండియా కూటమి ముజ్రా డాన్స్ చేస్తోందని, దళితులు, బీసీల రిజర్వేషన్లను దోచుకుని ముస్లింలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, ఎంతగా అంటే ముస్లింలకు గుండు గుత్తగా రిజర్వేషన్లను మళ్లించేసినా కోర్టులు సైతం అడ్డుకోలేనంతగా మార్చేస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

 ప్రధాని మోదీ

 ప్రధాని మోదీ


ఇండియా కూటమిపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించారు. ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఇండియా కూటమి ముజ్రా డాన్స్ చేస్తోందని, దళితులు, బీసీల రిజర్వేషన్లను దోచుకుని ముస్లింలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, ఎంతగా అంటే ముస్లింలకు గుండు గుత్తగా రిజర్వేషన్లను మళ్లించేసినా కోర్టులు సైతం అడ్డుకోలేనంతగా మార్చేస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తాను చేస్తున్న ఈ వ్యాఖ్యలను లిఖితపూర్వకంగా ఖండించమని సవాల్ విసురుతున్న అని స్పష్టం చేశారు. అయితే, కూటమి ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బీహార్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. కూటమి పార్టీలు పొరుగు దేశాలకు భయపడుతున్నాయని, ఉగ్రవాదంపై తన పోరును అడ్డుకునేందుకు ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని దుయ్యబట్టారు. బీహార్ నుంచి వలస వెళ్లిన వారిపై పంజాబ్, తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు, తమిళనాడులోని డిఎంకె, పశ్చిమ బెంగాల్లోని టిఎంసి నేతలు అవమానకరంగా మాట్లాడారని, ఈ వ్యాఖ్యలు ఇక్కడి వారిని ఎంత బాధ పెట్టాయో తనకు తెలుసునని ప్రధాని వ్యాఖ్యానించారు. బీహారీలను ఎంతగా అవమానిస్తున్నా ఇక్కడి ఆర్జెడి నాయకులకు కనీసం నిరసన తెలిపే ధైర్యం కూడా లేదని విమర్శించారు. తమ ఎన్నికల గుర్తు లాంతరుతో ముజ్రా డాన్స్ చేయడమే వచ్చని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి ఓటమి దిశగా పయనిస్తోందని, జూన్ 4న ఫలితం చూసిన తరువాత ఆర్జెడి, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరినొకరు కుమ్ముకుని, ఒకరు బట్టలు ఒకరు చించుకోవడం ఖాయం అని మోడీ పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్