కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అగ్ని వీర్ విధానాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అగ్ని వీర్ పేరుతో బిజెపి ప్రభుత్వం సాయుధ దళాల్లో కొన్నాళ్లపాటు మాత్రమే పని చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ విధానాన్ని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అగ్ని వీర్ విధానాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అగ్ని వీర్ పేరుతో బిజెపి ప్రభుత్వం సాయుధ దళాల్లో కొన్నాళ్లపాటు మాత్రమే పని చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ విధానాన్ని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. దీనిపై తాజాగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్ని వీర్ పథకాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేసిన రాహుల్ గాంధీ.. గతంలో మాదిరిగానే సాయుధ దళాల్లో రిక్రూట్మెంట్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి మాత్రమే బిజెపి గెలుస్తుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జోష్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని అన్ని స్థానాల్లో ఇండియా కూటమి విజయభావుట ఎగురవేస్తుందని స్పష్టం చేశారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ లు రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ దాన్ని కాపాడేందుకు కృషి చేస్తుందని వెల్లడించారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమన్న రాహుల్ గాంధీ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గడచిన పదేళ్లలో బిజెపి దేశానికి చేసింది ఏమీ లేదని రాహుల్ గాంధీ వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు గెలిస్తేనే దేశంలో ప్రజాస్వామ్యం నిలుస్తుందని పేర్కొన్న రాహుల్ గాంధీ.. అన్ని ప్రాంతాల్లోనూ ఇండియా కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు అండగా నిలవాలని ప్రజలను కోరారు.