బ్యాంకింగ్ రంగంలో నిరుద్యోగ యువతకు అపారమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. గడిచిన 10 ఏళ్లలో వివిధ బ్యాంకుల్లో లక్షలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగాలను సాధించారు. తాజాగా మరో కీలక బ్యాంకులో వందలాది ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. కెనరా బ్యాంకులో మూడువేల అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఉద్యోగ నోటిఫికేషన్
బ్యాంకింగ్ రంగంలో నిరుద్యోగ యువతకు అపారమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. గడిచిన 10 ఏళ్లలో వివిధ బ్యాంకుల్లో లక్షలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగాలను సాధించారు. తాజాగా మరో కీలక బ్యాంకులో వందలాది ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. కెనరా బ్యాంకులో మూడువేల అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు కెనరా బ్యాంకు అధికారిక వెబ్సైటు ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వంతో గుర్తించబడిన తత్సమాన అర్హత కలిగిన కోర్టును పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు అవకాశాన్ని కల్పించింది. కెనరా బ్యాంక్ అధికారికి వెబ్సైట్ canarabank.com ద్వారా దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు తప్పనిసరిగా నేషనల్ అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్ లో www.nats.education.gov.in లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. ఎంపికైన వారికి రూ.15 వేలు స్టై ఫండ్ లభిస్తుంది. అదనపు అలవెన్సులు లేదా ప్రయోజనాలు ఉండవు.