National Defence Fund : భారత ఆర్మీకి విరాళం ఇద్దామనుకుంటున్నారా.. వివరాలివిగో..

నేషనల్ డిఫెన్స్ ఫండ్ NDF.. ఇది భారత సైన్యం కోసం స్వచ్ఛందంగా విరాళాలు సేకరించే నిధి. 1962లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ నిధులను ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (పారామిలటరీ బలగాలు కూడా) సంక్షేమం కోసం, వారిపై ఆధారపడేవారికోసం (కుటుంబాలు) ఉపయోగిస్తారు.

national defence fund
నేషనల్ డిఫెన్స్ ఫండ్

న్యూఢిల్లీ: దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని సరిహద్దుల్లో భారత వీర సైనికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు. వారి కుటుంబాలను వదిలేసి.. కటిక చీకట్లలో, మండుటెండల్లో, మంచు కొరికే చలిలో.. శత్రుమూకలను అడ్డుకొంటున్నారు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తూ చేస్తూ దేశ రక్షణలో కంటి మీద కునుకు లేకుండా పోరాటం చేస్తున్నారు. వారు అంతలా కష్టపడుతుంటే మనం భద్రంగా ఎలాంటి భయం లేకుండా, కుటుంబంతో సంతోషంగా ఉంటున్నాం. సరిహద్దుకు వెళ్లి యుద్ధం చేయకపోయినా, మనవంతుగా సైనికులకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఏర్పడింది. ఇలాంటి కఠిన సమయాల్లో భారత ప్రభుత్వానికి, రక్షణ శాఖకు, సైనికులకు మనవంతుగా నగదు రూపేణా సహాయం అందిద్దాం. దానికోసం ఆన్‌లైన్‌లోనే భారత సైన్యానికి విరాళం అందించవచ్చు.

నేషనల్ డిఫెన్స్ ఫండ్ NDF.. ఇది భారత సైన్యం కోసం స్వచ్ఛందంగా విరాళాలు సేకరించే నిధి. 1962లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ నిధులను ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (పారామిలటరీ బలగాలు కూడా) సంక్షేమం కోసం, వారిపై ఆధారపడేవారికోసం (కుటుంబాలు) ఉపయోగిస్తారు. ఈ నిధికి ప్రధాన మంత్రి చైర్మన్‌గా ఉంటారు. కేంద్ర రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, హోంశాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ట్రెజరర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ వ్యవహారాలు సెక్రటరీ హోదాలో పీఎంవో జాయింట్ సెక్రటరీ చూస్తారు. దీనికి సంబంధించిన నిధులు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద ఉంటాయి. ఈ నిధికి విరాళాలు అందించే వారికి సెక్షన్ 80 (జీ) కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. 

ఎన్డీఎఫ్ విరాళాలకు సంబంధించిన వివరాలు: 

ఎన్డీఎఫ్ బ్యాంకు అకౌంట్ పేరు: నేషనల్ డిఫెన్స్ ఫండ్ (National Defence Fund)

అకౌంట్ నంబర్: 11084239799

బ్యాంకు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్‌స్టిట్యూషన్ డివిజన్, 4వ అంతస్థు, పార్లమెంట్ స్ట్రీట్, న్యూఢిల్లీ

ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : SBIN0000691


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్