గాడిదలు కాస్తూ నెలకు 3 లక్షల సంపాదన.. ఆయన ఇంటికి పెద్ద పెద్ద కంపెనీల క్యూ

గాడిదలను మేపుకొనే ఏటా రూ.30 లక్షలు సంపాదిస్తున్నాడో వ్యక్తి. నెలకు రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు వెనకేసుకుంటున్నాడు. గుజరాత్‌కు చెందిన ధీరేన్ సోలంకీ అనే వ్యక్తి పలు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా ఉద్యోగం రాలేదు.

donkeys
ప్రతీకాత్మక చిత్రం

అహ్మదాబాద్, ఈవార్తలు న్యూస్: చదువు సంధ్యా లేదు.. ఎందుకురా ఆ బతుకు.. ఇంట్లో నిన్ను కూర్చోబెట్టి మేపుతున్నం.. కనీసం గాడిదలను మేపినా అవి పనైనా చేస్తాయి.. అంటూ పెద్దోళ్లు తిట్టే తిట్లు మనకు తెలియనివి కావు. కానీ, ఆ గాడిదలను మేపుకొనే ఏటా రూ.30 లక్షలు సంపాదిస్తున్నాడో వ్యక్తి. నెలకు రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు వెనకేసుకుంటున్నాడు. గుజరాత్‌కు చెందిన ధీరేన్ సోలంకీ అనే వ్యక్తి పలు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా ఉద్యోగం రాలేదు. దీంతో ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాడు. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని ఎలా నెట్టుకురావడం అని గ్రహించి, ఏదైనా బిజినెస్ పెట్టుకుందామని ఆలోచించాడు.

అదే సమయంలో గాడిదల పాలకు మంచి డిమాండ్ ఉందని తెలుసుకున్నాడు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో గాడిద పాలకు ఎక్కువ డిమాండ్ ఉందని, ఆ బిజినెస్ స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాడు. వెంటనే దానికి సంబంధించిన సమాచారం సేకరించి.. రూ.22 లక్షల పెట్టుబడి పెట్టి 20 గాడిదలను కొన్నాడు. సొంత ఊరిలోనే ఫామ్‌ను ఏర్పాటు చేశాడు. ఆ గాడిదలు కాస్తా ఇప్పుడు 42 అయ్యాయి. ఆ గాడిదలు ఇచ్చే పాలను అమ్ముకుంటూ ఇప్పుడు లాభాలు గడిస్తున్నాడు. ఒక్కో లీటరు పాలు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అమ్ముడుపోతున్నాయని చెప్తున్నాడు.

పలు పెద్ద పెద్ద సౌందర్య ఉత్పత్తుల తయారీ కంపెనీలు నా వద్ద పాలు కొనేందుకు క్యూ కడుతున్నాయని, ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకొని అమ్ముతున్నానని తెలిపాడు. పౌడర్ రూపంలోనూ అమ్ముతున్నట్లు వెల్లడించాడు. ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచిస్తే ఎంతోమంికి మంచి ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నాడు.

గాడిద పాలతో లాభాలు:

- గాడిద పాలల్లో లాక్టోస్ అధికంగా ఉంటుంది. ఇది సహజ శక్తి వనరు. ఎండాకాంలో గాడిద పాలు తాగడం మంచిది. క్రీడాకారులు గాడిద పాలనే ఎక్కువగా తీసుకుంటారు.

- ఈ పాలల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, బీ1, బీ2, బీ6, సీ, డీ, ఈ ఉంటాయి.

- యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మ ముడతలు తగ్గిపోతాయి.

- జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉబ్బరం, మలబద్దకం, వంటి సమస్యల నుంచి దూరం చేస్తాయి. 

- పూర్వకాలంలో కోరింత దగ్గు, గాయాల చికిత్సకు వాడేవారు. 

- పలు సౌందర్య సాధనాల్లో గాడిద పాలను ఉపయోగిస్తారు.

వెబ్ స్టోరీస్