కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు సేవలకు పన్ను మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఎంతో మేలు చేకూరనుంది. రైల్వేశాఖ అందించే ప్లాట్ ఫామ్ టికెట్లు, వెయిటింగ్ లాకర్ రూమ్స్, బ్యాటరీ ఆపరేటర్ సర్వీసులు, ఇంటర్ రైల్వే సర్వీస్లకు ఇకపై జీఎస్టీ ఉండదు.
జీఎస్టీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు సేవలకు పన్ను మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఎంతో మేలు చేకూరనుంది. రైల్వేశాఖ అందించే ప్లాట్ ఫామ్ టికెట్లు, వెయిటింగ్ లాకర్ రూమ్స్, బ్యాటరీ ఆపరేటర్ సర్వీసులు, ఇంటర్ రైల్వే సర్వీస్లకు ఇకపై జీఎస్టీ ఉండదు. అన్ని రకాల మిల్క్ క్యాన్లు, కాటన్ బాక్సులపై జిఎస్టి 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. సోలార్ కుక్కర్లపై జిఎస్టి 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. ఫైర్ స్ప్రింకర్లతోపాటు అన్ని రకాల స్ప్రింకర్లపై 12 శాతం జీఎస్టీ విధించనున్నారు. అలాగే విద్యార్థులు విద్యాసంస్థల హాస్టల్లో కాకుండా ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటే నెలవారి అద్దెపై జిఎస్టిని మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించింది. విద్యార్థుల నుంచి వసూలు చేసే నెలవారి అద్దె రూ.20,000 లోపు ఉండాలి హాస్టళ్ల నిర్వాహకులు మోసాలకు పాల్పడకుండా ఉండేందుకు సంబంధిత విద్యార్థి కనీసం 90 రోజులుగా ఆ వసతి గృహంలో ఉండాలని నిబంధనను పెట్టారు. ఇనుము, ఉక్కు, అల్యూమినియంతో తయారు చేసిన పాల క్యాన్లపై జిఎస్టిని ఏకీకృతం చేస్తూ 12 శాతానికి తగ్గించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చిరు వ్యాపారులకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ ను జిఎస్టి పరిధిలోకి తేవాలన్నదే ఎన్డిఏ నిర్ణయంగా కేంద్రమంత్రి పేర్కొన్నారు. 2017లో అప్పటి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్లు ఆమె గుర్తు చేశారు. అయితే, దీనిపై రాష్ట్రాలు తేల్చుకోవాల్సి ఉందని జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
మరికొన్ని కీలక నిర్ణయాలు
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలను కూడా తీసుకున్నారు. రక్షణ దళాలకు నిర్దిష్ట వస్తువుల దిగుమతిపై 2030 వరకు ఐజిఎస్టి నుంచి మినహాయింపు ఉంటుంది. రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ (రెరా) 2017 జూన్ 28 వరకు జరిపిన చట్టబద్ధమైన వసూళ్ల జిటిఆర్ ఎంట్రీ-4 పరిధిలోకి వస్తాయన్న కారణంతో ఆ వసూలను జీఎస్టీ నుంచి మినహాయించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వెల్లడించారు.