తొలిసారి పార్లమెంట్‌లో అడుగు పెట్టారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. వయనాడ్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచిన ఆమె.. గురువారం లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె కేరళ చేనేత చీర ధరించి పార్లమెంట్‌కు హాజరయ్యారు.
పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ
తొలిసారి పార్లమెంట్‌లో అడుగు పెట్టారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. వయనాడ్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచిన ఆమె.. గురువారం లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె కేరళ చేనేత చీర ధరించి పార్లమెంట్‌కు హాజరయ్యారు. కేరళలో ప్రసిద్ధి చెందిన కసవుగా పిలిచే చేనేత చీరను ఆమె ధరించారు. తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె పార్లమెంట్ ఆవరణలోకి రాగానే.. కాంగ్రెస్ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో ఒక అద్భుత సన్నివేేశం చోటుచేసుకుంది. ప్రియాంక పార్లమెంట్ మెట్లు ఎక్కుతుండగా.. రాహుల్ గాంధీ తన సెల్‌ఫోన్‌లో తన సోదరి ప్రియాంకను ఫొటో తీశారు. ప్రియాంకతో పాటు సహచర కాంగ్రెస్ ఎంపీలంతా నవ్వుతూ కనిపించారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతైనా ఒక అన్నకు చెల్లి ఎప్పుడూ స్పెషలే అంటూ కామెంట్లు చేస్తున్నారు. దేశానికి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు.. తాము ఎంత ఎత్తులో ఉన్నా అన్నా చెల్లెలి ప్రేమకు అవధులు ఉండవు అని ఈ సందర్భం నిరూపించిందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్‌లోనూ వీడియోను పోస్ట్ చేసి.. ప్రౌడ్ బ్రదర్ అని కామెంట్ చేసింది. కాగా.. ప్రియాంక గాంధీ లోక్‌సభలో ప్రమాణం చేశారు. అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం సీపీపీ చైర్మన్ సోనియాగాంధీ సమక్షంలో సహచర ఎంపీలతో కలిసి సంభాషించారు.
Proud Brother ❤️ pic.twitter.com/InNUypMxce
— Congress (@INCIndia) November 28, 2024