ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ కుమారు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ముకేశ్ అంబానీతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ కుమారు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు వివాహ వేడుకకు ఆహ్వానం రావడంతో వెళ్లారు. ముంబయిలోని జియో వరల్డ్‌లో ఈ వివాహం జరిగింది. వివాహ వేడుకకు హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ నూతన వదూవరులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌లను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ముకేష్ అంబానీ స్వయంగా దంపతులు వద్దకు తీసుకెళ్లి ఆశీర్వచనాలు అందించేలా చేశారు. పవన్, చంద్రబాబు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇదే వివాహ వేడుకకు రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబాయ్ పవన్‌తో రామ్ చరణ్ ఫొటోలు దిగారు. ఈ వివాహ వేడుకలకు రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రీలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. శుక్రవారం వివాహం జరగ్గా, శనివారం అనంత్, రాధికా శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను అంబానీ కుటుంబం ఆహ్వానించింది.