NEET UG 2024 : నీట్ యూజీ 2024 పరీక్షపై కీలక తీర్పు వెలువరించిన సీజేఐ

నీట్ యూజీ 2024 పరీక్షపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచీ ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం.. సీజేఐ తీర్పును వెల్లడించారు.

neet exam

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : నీట్ యూజీ 2024 పరీక్షపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచీ ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం.. సీజేఐ తీర్పును వెల్లడించారు. ‘పేపర్ లీక్ అయ్యిందన్నది వాస్తవమే. బీహార్‌కు చెందిన 155 మంది విద్యార్థులకు మాత్రమే లబ్ధి చేకూరింది. హజారీబాగ్, పాట్నాలో పేపర్ లీక్ అయ్యింది. కానీ దేశమంతా లీక్ అయ్యిందని చెప్పలేం. కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలి. మద్రాస్ ఐఐటీ రిపోర్టును కూడా అధ్యయనం చేశాం’ అని వెల్లడించారు.

అయితే, నీట్ పరీక్షను మరోసారి నిర్వహించాలన్న విద్యార్థుల తరఫు వాదనతో సుప్రీం ఏకీభవించలేదు. నీట్ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని సీజేఐ స్పష్టం చేశారు. నీట్ రద్దు చేస్తే 24 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని తేల్చిచెప్పారు. యథావిధిగా కౌన్సెలింగ్ కొనసాగించాలని ఆదేశించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్