ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. యూజర్ల వ్యక్తిగత సమాచారంపై కీలక సూచన చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ, ఈవార్తలు : ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. యూజర్ల వ్యక్తిగత సమాచారంపై కీలక సూచన చేసింది. ఆండ్రాయిడ్ 12, 12 ఎల్, 13, 14 వెర్షన్లు వాడుతున్న స్మార్ట్ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-in) హెచ్చరించింది. ఈ ఫోన్లలో హానికారక మాల్వేర్‌ను సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తించిందని వెల్లడించింది. దీనివల్ల ఫోన్లు హ్యాకింగ్‌కు గురై, వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ముప్పు ఉందని వివరించింది. వెంటనే పై ఆండ్రాయిడ్ వెర్షన్లు వాడుతున్న వినియోగదారులు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
సెర్ట్-ఇన్ సంస్థ.. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ. ఇండియన్ సైబర్ స్పేస్‌ను భద్రంగా ఉంచడమే దీని విధి. సెక్యూరిటీ క్వాలిటీ మేనేజ్‌మెంట్ సర్వీస్ అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. సైబర్ సెక్యూరిటీలో అత్యవసర నిర్ణయాలు తీసుకొని హ్యాకింగ్ నుంచి భారత సైబర్ వ్యవస్థను కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తుంది.