Territorial Army : భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు.. సైన్యం కోసం మహేంద్ర సింగ్ ధోనీ బరిలోకి..?

భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీకి అవసరమైన మద్దతు కోసం ప్రాదేశిక సైన్యాన్ని (territorial army) ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు భారత ఆర్మీ చీఫ్‌కు అధికారాలు కట్టబెట్టింది.

ms dhoni army

లెఫ్ట్‌నెంట్ కర్నల్ హోదాలో మహేంద్ర సింగ్ ధోనీ

న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీకి అవసరమైన మద్దతు కోసం ప్రాదేశిక సైన్యాన్ని (territorial army) ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు భారత ఆర్మీ చీఫ్‌కు అధికారాలు కట్టబెట్టింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో త్రివిధ దళాల అధిపతుల భేటీ అనంతరం కేంద్రం ఈ తాజా ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల మేరకు.. ఆర్మీ చీఫ్ అవసరమైన మేరకు ప్రాదేశిక సైన్యం అందుబాటులో ఉండనుంది. ఇప్పటికిప్పుడు 14 బెటాలియన్లు విధుల్లోకి తక్షణమే రప్పించనున్నారు. 

ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్ ఆర్మీ) ఏం చేస్తుందంటే..

టెరిటోరియల్ ఆర్మీ.. ఆర్మీలో ఒక భాగం. పార్ట్ టైమ్ వాలంటీర్లతో కూడిన మిలటరీ రిజర్వ్ ఫోర్స్ ఇది. ప్రస్తుతం ఈ ప్రాదేశిక సైన్యం భారత సైన్యానికి వెన్నుదన్నుగా ఉండనుంది. దేశ భద్రత ప్రభావితమైన పరిస్థితుల్లో అవసరమైన సేవలను నిర్వహించడంలో పౌర పరిపాలనకు ఈ ఆర్మీ సహాయం చేస్తుంది. 1949 అక్టోబర్ 9వ తేదీన అప్పటి భారత గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి దీన్ని ప్రారంభించారు. సాధారణ సైన్యం తర్వాత రెండవ రక్షణ శ్రేణి. ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో 40,000 మంది మొదటి శ్రేణి, 160,000 మంది రెండవ శ్రేణి దళాలు ఉన్నాయి. 1962,1965, 1971 యుద్ధాల్లో భారత సైన్యంతో కలిసి ప్రాదేశిక సైన్యం పనిచేసింది. ఇందులో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్-కమిషన్డ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది ఉంటారు.

ప్రాదేశిక సైన్యంలో పలువురు ప్రముఖులు:

- టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ (లెఫ్ట్‌నెంట్ కర్నల్-106ఏ టీఏ బెటాలియన్ ప్యారాచూట్ రెజిమెంట్)

- టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ (ఎయిర్ ఫోర్స్-గ్రూప్ కెప్టెన్)

- టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్

- షూటర్ అభినవ్ బింద్రా

- కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలట్

- కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్

- నటుడు మోహన్ లాల్

- నటుడు నానా పటేకర్


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్