Agniveer | అగ్నివీర్ పథకంపై కేంద్రం కీలక నిర్ణయం

అగ్నివీర్ Agniveer పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ బలగాలైన సీఐఎస్ఎఫ్ CISF, బీఎస్ఎఫ్‌ BSFలో మాజీ అగ్నివీర్‌లకు 10 శాతం పోస్టులు కేటాయించాలని నిర్ణయించాయి.

agniveer

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ, ఈవార్తలు : అగ్నివీర్ Agniveer పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ బలగాలైన సీఐఎస్ఎఫ్ CISF, బీఎస్ఎఫ్‌ BSFలో మాజీ అగ్నివీర్‌లకు 10 శాతం పోస్టులు కేటాయించాలని నిర్ణయించాయి. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నినాసింగ్, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ రిక్రూట్‌మెంట్ వివరాలు వెల్లడించారు. భవిష్యత్తులో చేపట్టబోయే కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్లలో 10 శాతం పోస్టులు మాజీ అగ్నవీరులకు కేటాయిస్తామని తెలిపారు. దీనిపై కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుందని, ఆ దిశగానే తాము రిక్రూట్‌మెంట్ విధానంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

‘అగ్నివీరులకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంటుంది. వారు క్రమశిక్షణ కలిగి, శిక్షణ నేర్చుకున్న సైనికులు. బీఎస్‌ఎఫ్‌కు సరిగ్గా సరిపోతారు. వాళ్లను దేశ సరిహద్దుల్లో మోహరిస్తాం’ అని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అగర్వాల్ తెలిపారు. మొత్తం పోస్టుల్లో 10 శాతం కోటా వారికే కేటాయిస్తామని వెల్లడించారు. మరోవైపు సీఆర్‌పీఎఫ్‌ CRPFలోనూ అగ్నివీరులను తీసుకుంటామని, తామూ 10 శాతం పోస్టులు కేటాయిస్తామని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీశ్ దయాల్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF, సశస్త్ర సీమ బల్ SSB కూడా అగ్నివీరుల కోసం ప్రత్యేక కోటా కేటాయిస్తామని పేర్కొన్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్