Wikipedia Notice | తప్పుడు సమాచారం ఫిర్యాదు.. వికిపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు

మనకు ఏ సమాచారం కావాలన్నా వికిపీడియా (wikipedia) క్షణాల్లో మనముందు ఉంచుతుంది. అయితే, అందులో నమోదు చేసే సమాచారం కచ్చితమైనదా? తప్పుడు సమాచారమా? అన్నది మనమే క్లారిఫై చేసుకోవాలి.

wikipedia

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ, ఈవార్తలు : మనకు ఏ సమాచారం కావాలన్నా వికిపీడియా (wikipedia) క్షణాల్లో మనముందు ఉంచుతుంది. అయితే, అందులో నమోదు చేసే సమాచారం కచ్చితమైనదా? తప్పుడు సమాచారమా? అన్నది మనమే క్లారిఫై చేసుకోవాలి. ఎందుకంటే.. మనలాంటి వాళ్లే (అనధికారిక వ్యక్తులు) అందులో సమాచారాన్ని చేర్చేందుకు, మార్చేందుకు అవకాశం ఉంటుంది. ఎవరు పడితే వాళ్లు.. సమాచారాన్ని నమోదు చేయవచ్చు. ఇలాంటి వెసులుబాటు ఉండటం మంచిదే అయినా, కొన్ని సందర్భాల్లో కొందరు ఆకతాయిలు తప్పుడు సమాచారాన్ని చేర్చే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు వికిపీడియాకు ఇదే తలనొప్పిగా మారింది. ఎందుకంటే.. వికిపీడియాలో తప్పుడు సమాచారం నమోదు అవుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం వికిపీడియాకు నోటీసులు జారీచేసింది. తప్పుడు సమాచారం ఉంటోందన్న ఫిర్యాదుల మేరకు ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.

‘వికిపీడియాలో పక్షపాతంగా సమాచారం ఉంటోందని ఫిర్యాదులు అందాయి. చిన్న సంపాదకులు, సంస్థలకు కూడా కంటెంట్‌పై ఎడిటోరియల్ నియంత్రణ ఉంటుంది. అలాంటప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వికిపీడియాకు ఆ వ్యవస్థ ఎందుకు లేదు? వికిపీడియాను మధ్యవర్తిగా కాకుండా, పబ్లిషర్‌గా ఎందుకు పరిగణించకూడదు? కొంత మంది వ్యక్తులతో కూడిన బృందానికి మాత్రమే ఈ పేజీల్లోని సమాచారంపై నియంత్రణ ఉందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది’ అని నోటీసులో తెలిపింది.

ఇటీవల వికిపీడియా వరుసగా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నది. ఏఎన్‌ఐ న్యూస్ ఏజెన్సీ కూడా వికిపీడియాపై దావా వేసింది. తమపై తప్పుడు సమాచారం నమోదు చేసిందని అభ్యంతరం వ్యక్తం చేసింది. వికిపీడియా తన పేజీలో ఏఎన్ఐ.. కేంద్ర ప్రభుత్వానికి ప్రచార కర్తలా ఉందని, పలు విషయాలను తప్పుగా నివేదించిందని పేర్కొంది. ఈ అంశంలో వికిపీడియాపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమన్లు జారీ చేసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్