ఆధార్ - రేషన్ కార్డు లింకేజీపై కేంద్రం కీలక నిర్ణయం

Aadhar Card - Ration Card Linkage | ఆధార్ కార్డు - రేషన్ కార్డు లింకేజీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్, రేషన్ కార్డు లింక్ చేయనివారికి మరోసారి అవకాశాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించింది.

aadhar ration card link

ఆధార్ - రేషన్ కార్డు లింక్

Aadhar Card - Ration Card Linkage | ఆధార్ కార్డు - రేషన్ కార్డు లింకేజీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్, రేషన్ కార్డు లింక్ చేయనివారికి మరోసారి అవకాశాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నెల 30వ తేదీతో లింకేజీ గడువు ముగియ నుండగా, ఆ గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా చాలా మంది ఆధార్, రేషన్ కార్డు లింక్ పూర్తి చేయగా, ఇంకా లింక్ చేయని లబ్ధిదారులకు ఉపయోగపడనుంది. రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నందున అవకతవకలను అడ్డుకోవడానికి ఆధార్ -రేషన్ నంబర్ లింక్ చేయాలని కేంద్రం గతంలో ఆదేశాలు జారీ చేసింది. తాజాగా, గడువును పొడిగించింది.

రేషన్ కార్డు లింక్ చేయనివారు.. రేషన్ షాపుకు లేదా దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) పాయింట్ వద్దకు వెళ్లి లింక్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్, రేషన్ నంబర్ సహా అవసరమైన పత్రాలు అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్