కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. నెట్ ప‌రీక్ష ర‌ద్దు

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ugc net

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నెట్ పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ నెల 18వ తేదీన యూజీసీ నెట్ - 2024 పరీక్ష నిర్వహించగా, పేపర్ లీక్ అయినట్టు గుర్తించారు. దీంతో పరీక్షను రద్దు చేస్తూ ఎన్టీయే నిర్ణయం తీసుకుంది. నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు గుర్తించామని యూజీసీ పేర్కొంది. అటు.. నీట్ పరీక్షపైనా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పట్టుబడుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్