ఒడిశా సంపదను దోచుకున్న బీజేపీ, బీజేడీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

ఒడిస్సాలోని సంపదను బిజెడి, బిజెపి దోచుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఒడిసాలోని బాలాసోర్ లోక్ సభ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెడి సర్కారుపైన, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Congress leader Rahul Gandhi

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ



ఒడిస్సాలోని సంపదను బిజెడి, బిజెపి దోచుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఒడిసాలోని బాలాసోర్ లోక్ సభ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెడి సర్కారుపైన, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న బంధాన్ని బద్దలు కొట్టి ఒడిస్సాలోను తెలంగాణ తరహా ప్రజా పాలన అందిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు అత్యంత సన్నిహితుడైన వీకే పాండియన్ చెప్పినట్టుగా ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు కేంద్ర ప్రభుత్వం తనపై 24 కేసులు పెట్టిందని ఈడీ 50 గంటల పాటు ప్రశ్నించింది అని రాహుల్ గాంధీ వెల్లడించారు. నవీన్ పట్నాయక్ బిజెపిపై పోరాడుతుంటే ఇలాంటి కేసులు ఏవి ఎందుకు లేవని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు ప్రజలతో దొంగాటలు ఆడుతున్నాయని, ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని రాహుల్ గాంధీ కోరారు. ఒడిస్సా ప్రజలకు సంక్షేమాన్ని అందించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాహుల్ గాంధీ కోరారు. సంక్షేమంతోపాటు అభివృద్ధిని ఇక్కడి ప్రజలకు పరిచయం చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని నవీన్ పట్నాయక్ ప్రజలతో దొంగాటలు ఆడుతున్నారని, ఓట్ల రాజకీయం కోసం ప్రస్తుతం ఈ ఇద్దరు నాయకులు విమర్శలు చేసుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజకీయ పార్టీల నాయకుల కంటే ప్రజలు తెలివైన వాళ్ళ అన్న విషయాన్ని వీరిద్దరూ మర్చిపోయారు అన్న రాహుల్ గాంధీ.. ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పిన తర్వాత వీరికి అర్థమవుతుందన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్