మహాకుంభ మేళాకు వెళ్లాలనుకునే తెలుగువాళ్లు.. రైలు మార్గం ద్వారానే వెళ్తే మంచిది. బస్సు ద్వారా వెళ్తే 16 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు నిలిపివేస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ మేళాకు వెళ్లాల్సిన పరిస్థితి.
ప్రయాగ్ రాజ్
మహాకుంభ మేళాకు వెళ్లాలనుకునే తెలుగువాళ్లు.. రైలు మార్గం ద్వారానే వెళ్తే మంచిది. బస్సు ద్వారా వెళ్తే 16 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు నిలిపివేస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ మేళాకు వెళ్లాల్సిన పరిస్థితి. కుంభమేళాకు వెళ్లేవారి సౌకర్యార్థం అక్కడి ప్రభుత్వం.. మేళాను సెక్టార్లు, కాటున్ పాండ్స్, ఘాట్స్‌గా విభజించింది. వాటిపై అవగాహన కలిగి ఉంటే మంచిది. లేకపోతే ఏమీ అర్థం కాదు. ఎటు వెళ్లి ఎటు వస్తారో అర్థం కాదు. మహాకుంభమేళాలో మొత్తం 24 సెక్టార్స్ ఉంటాయి. 16-17 కాటున్ పాండ్స్ ఉంటాయి. ప్రయాగ్‌రాజ్‌ను మూడు భాగాలుగా విభజించారు. 1. జ్యూస్సి, 2. హరిలాగంజ్ 3.సంగం. నదికి కుడి వైపు జ్యూస్సి ఉంటుంది. దీనిలో సెక్టర్ 12 నుండి 21 వరకు ఉంటాయి. హరిలాగంజ్.. ఇది నదిదాటి ఎడమ వైపు ఉంటుంది. దీనిలో సెక్టార్ 5, 6, 7, 8, 9, 10, 11, 18, 19 ఉంటాయి. సంగం.. ఇది మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఉంటుంది. దీనిలో సెక్టార్ 3,4 ఉంటాయి. మిగతావి 22, 23 చాలా దూరంలో ఉంటాయి.
వసతి సదుపాయాలు:
- హిందీ వాళ్లవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలు ఉన్నాయి. అక్కడ నింద్రించేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా సెక్టార్ 18లో వసతి ఏర్పాటు చేసుకోవచ్చు. నదికి 100 మీటర్ల పరిధిలోనే ఉంటాయి.
- సెక్టర్ 19,18,20 ఈ సెక్టర్స్ లో నాగసాధువు లు, అఘోరాలు, వుంటారు వాళ్ళు దగ్గరికి వెళ్తే ఏంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండ మంటారు చక్కగా ఉండొచ్చు.
- సెక్టార్ 1లో ప్రైవేట్ వసతి సదుపాయాలు ఉంటాయి. రోజుకు రూ.200 తీసుకుంటారు.
- అన్ని సెక్టార్లలో పెయిడ్ వసతులు ఉన్నాయి. రోజుకు రూ.1000-2000 తీసుకుంటారు (4 సభ్యులు ఉండొచ్చు)
భోజన సదుపాయాలు:
- అన్ని సెక్టార్లలో ప్రసాదాలు, భోజనాలు నిరంతరం ఉంటాయి. అన్నీ ఉచితం.
హెల్ప్ లైన్:
- రైల్వే స్టేషన్ నుంచి అడుగడుగునా పోలీసులు గైడ్ చేస్తారు. ఎటువైపు.. ఎలా వెళ్లాలో చెప్తారు.
ఇతరత్రా:
- నాగసాధువులు, అఘోరాలు, అఖాడాలను చూడాలనుకుంటే.. వాళ్ల ఆశీర్వదాలు తీసుకోవాలనుకుంటే సెక్టార్ 18, 19, 20లో ఉంటారు.
- కుటుంబంతో కలిసి వెళ్తే అన్నీ తీసుకొని వెళ్తే మంచిది. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
- ఒంటరిగా కంటే నలుగురు కలిసి వెళ్తే ఇంకా బెటర్.
- ఎన్ని కోట్ల మంది వచ్చినా సరిపోయేంత విశాల ప్రాంత ప్రయాగ్‌రాజ్.