తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు పెంపునుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ ఎత్తున టికెట్ల రేట్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఏపీలో మాత్రం ఈ సినిమా టికెట్ల పెంపును సంబంధించి మల్లగుల్లాలు పడుతుంది. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ల పెంపునుకు సంబంధించి ఎటువంటి స్పష్టత రాలేదు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తి ప్రస్తుతం నెలకొంది.
అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్
దేశ వ్యాప్తంగా విడుదలవుతున్న పుష్ప-2 సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అల్లు అర్జున్ సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే వేలాది స్క్రీన్స్ లో విడుదల అవుతున్న ఈ సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు పెంపునుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ ఎత్తున టికెట్ల రేట్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. అయితే ఏపీలో మాత్రం ఈ సినిమా టికెట్ల పెంపును సంబంధించి మల్లగుల్లాలు పడుతుంది. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ల పెంపునుకు సంబంధించి ఎటువంటి స్పష్టత రాలేదు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తి ప్రస్తుతం నెలకొంది. ఇప్పటికే అల్లు అర్జున్ తండ్రి ప్రముఖ నిర్మాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూడా కలిశారు. అయినప్పటికీ టిక్కెట్ల రేట్లు పెంపును కు సంబంధించి గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదు. దీనికి గతంలో జరిగిన వ్యవహారాలే కారణంగా కనిపిస్తున్నాయి. గడిచిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు నంద్యాల వెళ్లారు. అప్పటి నుంచి మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కు మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. పుష్ప-2 సినిమా ప్రమోషన్ లో భాగంగా దేశమంతటా పెరుగుతున్న అల్లు అర్జున్ ఎక్కడ మెగా ఫ్యామిలీ గురించి ప్రస్తావించడం లేదు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ గురించి కూడా మెగా కాంపౌండ్ నుంచి ఎటువంటి కామెంట్స్ రాలేదు.
సాధారణంగా అయితే చిరంజీవి వంటి వాళ్లు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ట్వీట్ అయినా పెడతారు. కానీ అటువంటి విషెస్ ఈసారి అల్లు అర్జున్ కు దక్కలేదు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య అగాధం తారాస్థాయికి పెరిగిందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తారా లేదా అన్నదానిపైన సర్వత్ర ఆసక్తి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాన్ని వెలువరించినప్పటికీ ఏపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలను చేపట్టకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంపునకు సంబంధించి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆగ్రహంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానుల పుండు మీద కారం చల్లినట్లు టిడిపి ఎంపీ చేసిన ఒక ట్వీట్ మరింత ఆగ్రహాన్ని రగిలిస్తోంది. నంద్యాల ఎంపీగా ఉన్న బైరెడ్డి శబరి తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఆమె మొదట బిజెపిలో ఆక్టివ్ గా ఉండేవారు. ఎన్నికల సమయంలో టిడిపిలో చేరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా ఆమె అల్లు అర్జున్ ను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. అయితే ఆత్మీట్ కొద్దిసేపట్లోనే డిలీట్ చేశారు. కానీ అప్పటికే ఆ ట్వీట్ చాలా వైరల్ కావడంతో పాటు ఎంతోమంది స్క్రీన్షాట్లు తీసి మరి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ఆమె చేసిన ట్వీట్లో ఏముందంటే.. అల్లు అర్జున్ గారు నంద్యాలలో మీరు చేసిన ఎలక్షన్ క్యాంపైన్ మా జనాలు ఇంకా మర్చిపోలేదు. నంద్యాలలో మీరు ఎలా అయితే ఫ్రీ ఎలక్షన్ ఈవెంట్ నిర్వహించారో అలాగే ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తారని కోరుకుంటున్నాం. నంద్యాల వెళ్లాలనే మీ సెంటిమెంట్ మాకు బాగా వర్క్ అయింది. కాబట్టి మీ సెంటిమెంట్ ఇప్పుడు మా సెంటిమెంట్ అయింది. పుష్ప2 సినిమా కూడా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అవ్వాలి అంటూ ఆమె వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దానిని డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆమె ఏ ఉద్దేశంతో చేశారో అన్నది తెలియాల్సి ఉంది. అయితే, ఆమె ట్వీట్ పై అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.