సముద్రంలో అనంత్ అంబానీ - రాధిక సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు

ప్రపంచంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్త, భారత కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు ప్రి వెడ్డింగ్, వివాహ వేడుకలను ప్రపంచమే చెప్పుకునేలా నిర్వహిస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలను కొద్ది రోజుల కిందట అంగరంగ వైభవంగా నిర్వహించిన ముఖేష్ అంబానీ.. తాజాగా తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధిక మర్చంట్ సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలను మరోసారి ఘనంగా నిర్వహిస్తున్నారు.

anant ambani radhika marchant

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్

ప్రపంచంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్త, భారత కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు ప్రి వెడ్డింగ్, వివాహ వేడుకలను ప్రపంచమే చెప్పుకునేలా నిర్వహిస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలను కొద్ది రోజుల కిందట అంగరంగ వైభవంగా నిర్వహించిన ముఖేష్ అంబానీ.. తాజాగా తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధిక మర్చంట్ సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలను మరోసారి ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఈ ఏడాది మార్చిలో గుజరాత్ లోని జామ్ నగర్ లో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన 1200 మంది ఈ వేడుకలకు హాజరయ్యారు. తొలి ప్రీ వెడ్డింగ్ వేడుకలకు రూ.1259 కోట్లు వెచ్చించినట్లు పలు సంస్థలు వెల్లడించాయి.

జూలైలో వివాహం జరగనున్న నేపథ్యంలో రెండోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలను ముఖేష్ అంబానీ నిర్వహిస్తున్నారు. విదేశాల్లో నిర్వహిస్తున్న రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలను సముద్రంలో నిర్వహించడానికి ముకేశ్ అంబానీ ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఏకంగా లగ్జరీ క్రూయిజ్ ను ముకేశ్ అంబానీ బుక్ చేశారు. మూడు రోజులపాటు ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్ కు ఈ క్రూయిజ్ వెళ్లనుంది. ఈ వివాహానికి హాజరయ్యే బంధువులు, స్నేహితులతో 4,380 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని సమాచారం. సుమారు 600 మంది వరకు స్నేహితులు, బంధువులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 28 నుంచి 30 వరకు ఇటలీ ఫ్రాన్స్ వరకు ఈ క్రూయిజ్ షిప్ ప్రయాణించనుంది. ఆనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ముఖేష్ అంబానీ.. వివాహాన్ని మరో రేంజ్ లో నిర్వహిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు అనుగుణంగానే భారీ మొత్తంలో ముకేశ్ అంబానీ తన కుమారుడి వివాహానికి ఖర్చు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్