Yeah అనే పదానికి అర్థం ఏంటి.. సుప్రీం చీఫ్ జస్టిస్ ఎందుకు అభ్యంతరం చెప్పారంటే..

సుప్రీం కోర్టులో ఓ లాయర్ యా (YEAH..!) అన్న పదం వాడినందుకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

cji yeah

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ, ఈవార్తలు: సుప్రీం కోర్టులో ఓ లాయర్ యా (YEAH..!) అన్న పదం వాడినందుకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కేసు సందర్భంగా లాయర్ పదే పదే యా.. యా.. అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై చిర్రెత్తుకొచ్చిన సీజేఐ.. ఆ పదం వాడకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ యా అనే పదం గౌరవప్రదమైనది కాదు. మీరు కేఫ్‌లో లేరు. కోర్టు రూంలో ఉన్నారు. పదాలను జాగ్రత్తగా వాడండి. యా అనే పదం నాకు, మా న్యాయమూర్తులకు ఎలర్జీ. అలాంటి పదాలు వాడేందుకు మీకు అనుమతించం’ అని స్పష్టం చేశారు.

YEAH.. అనే పదం ఎలా వచ్చిందంటే..

Yes (అవును) అనే పదానికి ఇంకో అర్థమే యా అని. ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు అవును అని అంగీకరిస్తూనే, ఆ వ్యాఖ్యలకు ఇంకా ఏదో ఒకటి జత చేయాలి అని తెలిపేదే.. ‘యా’. ఈ పదాన్ని తొలిసారిగా 1863లో అమెరికన్ ఇంగ్లిష్‌లో వాడారు. అయితే, తోటి వారితో మాట్లాడే సమయంలో Yeah అనే పదం చాలా కామన్. కానీ, పెద్దవారితో సంభోదించేప్పుడు Yeah అని అంటే అగౌరవంగా అనుకోవచ్చు. సుప్రీం కోర్టులోనూ అదే జరిగింది. ఈ పదం సందర్భాన్ని బట్టి, మాట్లాడే తీరును బట్టి కూడా మారుతుంది. ప్రొఫెషనలిజంలో యా అనే పదం గౌరవ పదం కాదు అని చాలా మంది భావన. సందర్భాన్ని బట్టి Yes, Correct అనే పదాలు వాడితేనే బెటర్ అని ఆంగ్ల భాష నిపుణులు చెప్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్