నిత్యావసరాల ధరల తగ్గుదలపై కేంద్రం అంచనాలు.. వర్షాలపైనే భారం

ఏ వస్తువు కొందామన్నా రేటు భగ్గుమంటోంది. ముఖ్యంగా కరోనా తర్వాత సగటు సామాన్యుడు బతకాలంటే నెలనెలా అప్పు చేయాల్సి వస్తోంది. పెట్రోల్ పది పైసలు తగ్గినా చాలా ఊపిరి పీల్చుకొనే సందర్భాలు అనేకం. గుడ్డు రూపాయి తగ్గినా గొప్పగా మాట్లాడుకొనే రోజులివి.

daily food essentials
ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు, నేషనల్ న్యూస్: ఏ వస్తువు కొందామన్నా రేటు భగ్గుమంటోంది. ముఖ్యంగా కరోనా తర్వాత సగటు సామాన్యుడు బతకాలంటే నెలనెలా అప్పు చేయాల్సి వస్తోంది. పెట్రోల్ పది పైసలు తగ్గినా చాలా ఊపిరి పీల్చుకొనే సందర్భాలు అనేకం. గుడ్డు రూపాయి తగ్గినా గొప్పగా మాట్లాడుకొనే రోజులివి. ధరలు ఎప్పుడు తగ్గుతాయి? అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటాడు సామాన్యుడు. అయితే, ధరల తగ్గుదలపై కేంద్ర ఆర్థిక శాఖ పలు అంచనాలు వేసింది. వర్షాలు పడితేనే ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. నెలవారీ సమీక్షలో భాగంగా నిత్యావసరాల ధరలను ఆర్థిక శాఖ సమీక్షించింది. ఈసారి వర్షాకాలంలో వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినందున.. వర్షాలు పడితే, పంటల దిగుబడులు పెరుగుతాయని, ఫలితంగా ధరలు తగ్గుతాయని వెల్లడించింది.

ఫిబ్రవరిలో రిటెయిల్‌ ద్రవ్యోల్బణం 8.7 శాతం ఉండగా, మార్చిలో 8.5 శాతానికి తగ్గింది. మరోవైపు పప్పు ధాన్యాల ధరలను కట్టడి చేసేందుకు బ్రెజిల్‌ నుంచి 20 వేల టన్నుల పెసరపప్పు, అర్జెంటీనా నుంచి కందులు దిగుమతి చేసుకొనేందుకు కేంద్రం చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు తుదిదశకు చేరుకున్నాయి. మొజాంబిక్‌, టాంజానియా, మయన్మార్‌ నుంచి పప్పుల దిగుమతికి ఆయా దేశాల ప్రభుత్వాలతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలు కూడా ధరల తగ్గుదలపై ప్రభావం చూపనున్నాయి.

వెబ్ స్టోరీస్