ఓటింగ్ అవకతవకలకు ఇకపై చెక్.. ఓటరు కార్డుకు ఆధార్, మొబైల్ లింక్.!

ఓటింగ్ సరళి సక్రమంగా జరగడం లేదని, అనేకచోట్ల అవకతవకులు జరుగుతున్నాయంటూ అనేక సందర్భాల్లో విమర్శలు వస్తుంటాయి. ఓటమి తర్వాత ప్రధాన రాజకీయ పార్టీలు ఈ తరహా విమర్శలు చేయడం పరిపాటిగా వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఓటరు కార్డుకు ఆధార్, మొబైల్ నెంబర్ లింక్ చేయాల్సిందిగా కీలక ఆదేశాలను జారీ చేసింది. ఓటర్ల గుర్తింపు సక్రమంగా జరిగేలా వాటర్ గుర్తింపు కార్డులను ఆధార్, మొబైల్ నెంబర్లతో అనుసంధానించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు సర్కులర్ జారీ చేసింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఓటింగ్ సరళి సక్రమంగా జరగడం లేదని, అనేకచోట్ల అవకతవకులు జరుగుతున్నాయంటూ అనేక సందర్భాల్లో విమర్శలు వస్తుంటాయి. ఓటమి తర్వాత ప్రధాన రాజకీయ పార్టీలు ఈ తరహా విమర్శలు చేయడం పరిపాటిగా వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఓటరు కార్డుకు ఆధార్, మొబైల్ నెంబర్ లింక్ చేయాల్సిందిగా కీలక ఆదేశాలను జారీ చేసింది. ఓటర్ల గుర్తింపు సక్రమంగా జరిగేలా వాటర్ గుర్తింపు కార్డులను ఆధార్, మొబైల్ నెంబర్లతో అనుసంధానించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు సర్కులర్ జారీ చేసింది. ఈనెల నాలుగో తేదీన నిర్వహించిన సీఈవోల సదస్సులో ఓపెన్ రిమార్క్స్ ఆఫ్ సీఈసీ పేరిట సీఈఓ లందరికీ పంపిణీ చేసిన పత్రాల్లోనూ ఈ మేరకు ఆదేశాలను జారీ చేసినట్లు చెబుతున్నారు. ఆయా ఆదేశాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సర్కులేట్ చేయాలని సీఈఓ లకు నిర్దేశించారని పేర్కొంది. ఓటర్ల గుర్తింపు సక్రమంగా ఉండేందుకు ఓటర్ కార్డుతో ఆధార్, మొబైల్ నెంబర్ అనుసంధా నించే అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదేశించింది. వీటితోపాటు జనన, మరణాల నమోదు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితా అని అప్డేట్ చేస్తుండాలని కూడా సిఇసి నిర్దేశించినట్లు పేర్కొంది. వాటర్ నమోదుకు ఆధార్ లింకు తప్పనిసరి కాదని 2002లో సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరణలో ఈసీ స్పష్టం చేసింది. దానికి భిన్నంగా తాజాగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 

అవకతవకలకు అడ్డుకట్ట..

దేశంలోని అనేక ప్రాంతాల్లో ఓటింగ్ సరళలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి అన్న విమర్శలు ఉన్నాయి. ఓటరు కార్డుకు ఆధార్, మొబైల్ నెంబర్ లింక్ చేసి లేకపోవడం వల్ల ఒకచోట ఓట్లు వేసిన ఎంతోమంది మరోచోట కూడా ఓట్లు వేస్తున్నారు. దీనివల్ల ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరుగుతోంది. సాధారణంగా ఒకచోట మాత్రమే ఓటరు ఓటు హక్కు కలిగి ఉండాలి. అందుకు భిన్నంగా అనేక చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ఇటువంటి ఓటర్ల వల్ల ఫలితాలు తారుమారు అవుతున్నాయి అన్న అనుమానాలు ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఈ మేరకు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఓటరు కార్డును ఆధార్, మొబైల్ నెంబర్తో లింక్ చేయడం వల్ల రెండోచోట ఓటు వేసేందుకు అవకాశం ఉండదు. తద్వారా ఓటింగ్ అక్రమాలకు చెప్పేందుకు అవకాశం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసినట్లు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్