దేశంలో మావోయిస్టు అనే పదం కనుమరుగు కానుందా? నెత్తురోడుతున్న చత్తీస్ గఢ్ దండకారుణ్యం.. ఒకే రోజు 36 మంది మృతి

దేశంలో ఇక మావోయిస్టు అనే పదమే కనుమరుగు కానుందా? కేంద్ర హోమంత్రి అమిత్ షా చెప్పినట్టు చత్తీస్ గడ్ లో నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోనుందా? అంటే తాజా ఘటన చూస్తే అవుననే అనిపిస్తున్నది.

chhattisgarh encounter

ప్రతీకాత్మక చిత్రం

ఈ వార్తలు, హైదరాబాద్: దేశంలో ఇక మావోయిస్టు అనే పదమే కనుమరుగు కానుందా? కేంద్ర హోమంత్రి అమిత్ షా చెప్పినట్టు చత్తీస్ గడ్ లో నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోనుందా? అంటే తాజా ఘటన చూస్తే అవుననే అనిపిస్తున్నది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న అబూజ్ మఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాల చేతిలో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. తాజాగా, శుక్రవారం జరిగిన భీకర దాడిలో ఒకే రోజు 36 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇందులో నీతి, కమలేశ్ లాంటి అగ్రనేతలున్నట్టు తెలుస్తున్నది. అలాగే, పోలీసులు స్వాధీనం చేసుకున్న మోడ్రన్ వెపన్స్ చూస్తుంటే ఇదే ప్రాంతంలో అగ్రనేతలు చాలామంది ఉన్నట్టు అర్థమవుతున్నది. దీంతో భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. చత్తీస్ గఢ్ దండకారుణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. 

ఉనికి కోసం వచ్చి.. చావు దెబ్బ తిన్నారు..

చత్తీస్ గడ్ లో ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రెండు సార్లు పర్యటించారు. ఈ సందర్భంగా సీమాంత ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని తుదముట్టించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగానే చత్తీస్ గఢ్ దండకారణ్యంలో బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం స్థల సేకరణ కూడా చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మావోయిస్టులు ఉనికి కోసం ఇక్కడకు వచ్చారు. మావోయిస్టు వారోత్సవాలను పురస్కరించుకొని అగ్రనేతలతో సహా  ఒక్కచోట చేరారు. విషయం తెలుసుకున్నడీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. నారాయణ్ పూర్-దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో ఓర్చా, బర్సూర్, గోవెల్, నెందూర్, తుల్ తులి ప్రాంతాల్లో ఆపరేషన్ చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మావోయిస్టులు ఎదురుపడగా.. ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 వరకు ఇది సాగింది. ఈ భీకర దాడితో దండకారుణ్యం నెత్తురోడింది. మొత్తం 36 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇంకొతమంది అడవిలోకి పారిపోగా.. వారికోసం బలగాలు గాలిస్తున్నాయి. సంఘటనా స్థలం నుంచి మృతదేహాలతోపాటు ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.దండకారణ్యం చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద ఘటన. అమిత్ షా పర్యటన తర్వాత ఇప్పటివరకూ మొత్తం 185 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. రోజురోజుకూ వారి సంఖ్య తగ్గిపోతున్నది. నక్సలిజాన్ని తుదముట్టించాలని కేంద్ర సర్కారు దృఢ నిశ్చయంతో ముందుకు పోతుండడంతో ఇక దేశంలో మావోయిస్టులు అనే పదం కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందనే చర్చ నడుస్తున్నది.  


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్