పదో తరగతి విద్యార్హతతో నెలకు 35 వేల జీతం.. గోల్డెన్ ఛాన్స్ మిస్ కావద్దు

పదో తరగతి పూర్తి చేసిన వారికి బయట 15000 జీతం ఇవ్వడం కూడా కష్టం అవుతోంది. అటువంటిది పదో తరగతి పూర్తి చేసిన వారికి రూ.35 వేల రూపాయలు జీతంతో మంచి ఉద్యోగ అవకాశాలను నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) కల్పిస్తోంది. పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులకు నాబార్డు మరో జాబ్ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది.

NABARD

నాబార్డు

పదో తరగతి పూర్తి చేసిన వారికి బయట 15000 జీతం ఇవ్వడం కూడా కష్టం అవుతోంది. అటువంటిది పదో తరగతి పూర్తి చేసిన వారికి రూ.35 వేల రూపాయలు జీతంతో మంచి ఉద్యోగ అవకాశాలను నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) కల్పిస్తోంది.  పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులకు నాబార్డు మరో జాబ్ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 108 ఆఫీస్ అటెండెంట్ (గ్రూప్ సి) పోస్టులను భర్తీ చేయబోతోంది. ఇందుకోసం ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ రెండో తేదీ నుంచి దరఖాస్తు చేసుకోనేందుకు అవకాశాన్ని కల్పించింది. దరఖాస్తులను నమోదు చేసేందుకు అక్టోబర్ 21 వరకు అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు పదోతరగతి పాసైన అభ్యర్థులు అర్హులుగా పేర్కొంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.35,000 రూపాయలను అందించనుంది. 

భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇవే..

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) బ్యాంకులో భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. ఉద్యోగం పేరు ఆఫీస్ అటెండెంట్ (గ్రూప్ సి), మొత్తం ఖాళీల సంఖ్య 108 కాగా, ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు 35వేల రూపాయలు వేతనాన్ని అందించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ అక్టోబర్ రెండు కాగా, చివరి తేదీ అక్టోబర్ 21. మరిన్ని వివరాలను సదర సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి చూసుకోవాల్సి ఉంటుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్