ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో తర్వాత కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందే కీలక నేత నారా లోకేష్ అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు, అధికారులకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులు, నాయకుల పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి తేలుస్తామంటూ హెచ్చరించారు.
అమెరికా పర్యటనలో నారా లోకేష్
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో తర్వాత కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందే కీలక నేత నారా లోకేష్ అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు, అధికారులకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులు, నాయకుల పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి తేలుస్తామంటూ హెచ్చరించారు. అనుకున్నట్టుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చెప్పినట్టుగానే నారా లోకేష్ రెడ్ బుక్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది వివిధ అంశాల్లో అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ లో ఎవరెవరు పేర్లు ఉన్నాయి అన్న చర్చ జరుగుతోంది. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ రెడ్ బుక్ లోని రెండు చాప్టర్లు అమలు చేశామని చెప్పిన నారా లోకేష్, కొద్దిరోజుల్లోనే మూడో చాప్టర్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. రెండు చాప్టర్లలోని నేతలు ఇప్పటికే వివిధ రకాల కేసులు పేరుతో జైలుకు వెళ్లారు. మూడో చాప్టర్ స్టార్ట్ చేస్తామని నారా లోకేష్ చెప్పడంతో ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారు అన్న చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఇప్పటికే గతంలో నోరు పారేసుకున్న ఎంతోమంది నేతలు జైల్లోకి వెళ్లారు. మరికొందరు మాత్రం ఎప్పటికీ బయట తిరుగుతున్నారు.
మూడో చాప్టర్లో అటువంటి నేతలు జైళ్ల ఊచలు లెక్కిస్తారు అంటూ టిడిపి నాయకులు చెబుతున్నారు. ఈ జాబితా పెద్దదిగానే ఉందని పలువురు టిడిపి ముఖ్య నేతలు చెబుతున్నారు. అమెరికాలో ఉండగా నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తిని రేకర్తిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సినిమా చూపిస్తామన్న నారా లోకేష్.. ఈ విషయంలో సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు. పాదయాత్ర సమయంలో తనను చాలా ఇబ్బందులకు గురి చేశారన్న లోకేష్.. రెడ్ బుక్ కు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడంటూ వ్యాఖ్యానించారు. గుడ్ బుక్ తెస్తామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డికి అందులో ఏం రాయాలో కూడా అర్థం కావడం లేదు అన్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి లుక్ అవుట్ నోటీసులు ఇచ్చే వారిని, అటువంటి వాటికి భయపడకుండా ఎన్నారైలు నిలబడ్డారంటూ ప్రశంసలు కురిపించారు. కొద్దిరోజుల్లోనే రెడ్ బుక్ మూడో చాప్టర్ అమలవుతుందంటూ స్పష్టం చేశారు.