తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపిన కొండా సురేఖ వ్యాఖ్యలు.. కౌంటర్‌ ఇచ్చిన నాగార్జున

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు సీనీ పరిశ్రమకు చెందిన కొందరిని లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. నాగ చైతన్య, సమంత విడాకులకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ కారణమంటూ సురేఖ మాట్లాడిన మాటలు ఇప్పుడు రగడకు కారణమవుతున్నాయి. కేటీఆర్‌ హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడని, హీరోయిన్లకు డ్రగ్స్‌ అలవాటు చేశాడని కొండా సురేఖ ఆరోపించారు. నాగ చైతన్య - సమంత విడాకులకు అతనే కారణమన్న సురేఖ.. ఫోన్‌ ట్యాపింగ్‌లకు పాల్పడి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని వాళ్లను బ్లాక్‌ మెయిల్‌ చేశారంటూ ఆరోపించారు.

Nagarjuna, Minister Konda Surekha, KTR

నాగార్జున, మంత్రి కొండా సురేఖ, కేటీఆర్‌

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు సీనీ పరిశ్రమకు చెందిన కొందరిని లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. నాగ చైతన్య, సమంత విడాకులకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ కారణమంటూ సురేఖ మాట్లాడిన మాటలు ఇప్పుడు రగడకు కారణమవుతున్నాయి. కేటీఆర్‌ హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడని, హీరోయిన్లకు డ్రగ్స్‌ అలవాటు చేశాడని కొండా సురేఖ ఆరోపించారు. నాగ చైతన్య - సమంత విడాకులకు అతనే కారణమన్న సురేఖ.. ఫోన్‌ ట్యాపింగ్‌లకు పాల్పడి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని వాళ్లను బ్లాక్‌ మెయిల్‌ చేశారంటూ ఆరోపించారు. కొంత మంది హీరోయిన్లకు తెలుగులో సినిమాలు చేయకుండా త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కేటీఆర్‌ కారణమని ఆమె ఆరోపించారు. దుబాయ్‌లో మనుషులను పెట్టి పోస్టులు పెట్టిస్తున్నారని మంత్రి సురేఖ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలతోపాటు సినీ పరిశ్రమలోనూ దుమారాన్ని రేపుతున్నాయి. 

ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రకాష్‌ రాజ్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ఆయన.. ఏంటీ సిగ్గు లేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా?.. జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన సురేఖ.. సినీ నటులు గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన షేర్‌ చేశారు. తాజాగా మంత్రి వ్యాఖ్యలపై హీరో నాగార్జున కూడా స్పందించారు. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ఆయన ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ’గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖగారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవీలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చఏసిన ఆరోపణలు పూర్తిగా అసంబంధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం నాగార్జున చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరోవైపు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నాయకులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు పలువురు నాయకులు మంత్రి వ్యాఖ్యలను ఖండించడంతోపాటు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా, ఉంటే సామాజిక మాధ్యమాలు వేదికగా కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ అన్నట్టుగా శ్రేణులు ఈ టాపిక్‌పై వాదనలు చేసుకుంటున్నాయి. మంత్రి మాట్లాడింది వాస్తవమే అంటూ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా కేటీఆర్‌ను ట్రోల్‌ చేస్తుండగా, మంత్రి వ్యాఖ్యలను తప్పుబడుతూ బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా మంత్రి సురేఖను ఎండగడుతున్నాయి. ఏది తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ చేసిన వాఖ్యలు రాజకీయ దుమారానికి కారణభూతంగా నిలిచాయి. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్