రాజ్యసభకు నాగబాబు..విజయసాయిరెడ్డి స్థానంలో ఎంపిక.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు విషయంలో జనసేన తర్జనభర్జన పడుతోంది. ఈ నెలాఖరులో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు ఒక స్థానాన్ని కేటాయించడం ద్వారా మంత్రివర్గంలోకి తీసుకోవాలని మొదట జనసేన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద ప్రతిపాదన పెట్టింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన వెలబడుతుందని అంత భావించారు. అయితే అనూహ్యంగా ఎమ్మెల్సీ స్థానాన్ని తీసుకోవడం విషయంలో జనసేన వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్థానం కంటే రాజ్యసభకు పంపించాలని సీఎం చంద్రబాబు నాయుడు వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదన పెట్టినట్లు చెబుతున్నారు.

Nagababu, CM Chandrababu Naidu

నాగబాబు, సీఎం చంద్రబాబు నాయుడు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు విషయంలో జనసేన తర్జనభర్జన పడుతోంది. ఈ నెలాఖరులో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు ఒక స్థానాన్ని కేటాయించడం ద్వారా మంత్రివర్గంలోకి తీసుకోవాలని మొదట జనసేన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద ప్రతిపాదన పెట్టింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన వెలబడుతుందని అంత భావించారు. అయితే అనూహ్యంగా ఎమ్మెల్సీ స్థానాన్ని తీసుకోవడం విషయంలో జనసేన వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్థానం కంటే రాజ్యసభకు పంపించాలని సీఎం చంద్రబాబు నాయుడు వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదన పెట్టినట్లు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా అంగీకారాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. నాగబాబు రాజ్యసభకు వెళ్లాలన్న ఆసక్తితో ఉండడంతోనే ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకున్నట్లు చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి కూటమికి ఆస్థానం దక్కే అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి రాజ్యసభకు వెళ్లాలన్న ఆసక్తితో నాగబాబు ఉండడంతోనే ఆయన దీనిని కోరునట్లు చెబుతున్నారు. విజయ సాయి రెడ్డి రాజీనామా ద్వారా ఖాళీ అయిన స్థానాన్ని నాగబాబు ఆశిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలియజేశారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు కూడా అంగీకారాన్ని తెలిపినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ సాయి రెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానాన్ని బిజెపి కోరుతోంది. బిజెపి అభ్యర్థిని నిలిపేందుకు సిద్ధమవుతుందన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని నాగబాబుకు కేటాయిస్తే ప్రతిగా ఎమ్మెల్సీ స్థానాన్ని బిజెపికి సీఎం చంద్రబాబు నాయుడు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

తీవ్రస్థాయిలో పోటీ..

ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెలాఖరున ఎన్నికలు జరగనున్నాయి. 5 ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి పార్టీలో చాలామంది ఆశావహులు ఉన్నారు. ఈ స్థానాలను ఆశిస్తున్న వారిలో బుద్దా వెంకన్న, బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, శాసనమండలం నుంచి పదవి విరమణ చేయబోతున్న ప్రస్తుత ఎమ్మెల్యేలు బీటి నాయుడు, దువ్వారపు రామారావు, అశోక్ బాబు తీవ్రస్థాయిలో తమ ప్రయత్నాలను సాగిస్తున్నారు. వీరితోపాటు మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ రాజ్యసభ సభ్యుడు కే యం సైపుల్ల తనయుడు జియావుల్లా కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. మైనారిటీ కోటాలో తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. ఇదే కోటాలో విశాఖకు చెందిన మహమ్మద్ నజీర్ కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరి ఎవరికి అవకాశం దొరుకుతుందో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్