జగన్‌, వర్మపై నాగబాబు కీలక వ్యాఖ్యలు.. ఆవిర్భావ సభలో హాట్‌ కామెంట్స్‌

పిఠాపురంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. పిఠాపురంలో పవన్‌ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే వారి ఖర్మ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని సృష్టిస్తున్నాయి. పిఠాపురంలో పని చేయాలని పవన్‌ కల్యాణ్‌ తమను పంపించినప్పుడు చాలా సంతోషం కలిగిందన్న నాగబాబు.. అక్కడకు వెళ్లిన తరువాత పవన్‌ విజయానికి తిరుగులేదని స్పష్టమైందన్నారు.

Mlc Nagababu

ఎమ్మెల్సీ నాగబాబు

పిఠాపురంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. పిఠాపురంలో పవన్‌ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే వారి ఖర్మ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని సృష్టిస్తున్నాయి. పిఠాపురంలో పని చేయాలని పవన్‌ కల్యాణ్‌ తమను పంపించినప్పుడు చాలా సంతోషం కలిగిందన్న నాగబాబు.. అక్కడకు వెళ్లిన తరువాత పవన్‌ విజయానికి తిరుగులేదని స్పష్టమైందన్నారు. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ విజయానికి రెండే కారణాలన్నారు. మొదటి ఫ్యాక్టర్‌ పవన్‌ కల్యాణ్‌ అయితే.. రెండో ఫ్యాక్టర్‌ జనసైనికులు, ప్రజలు, ఓటర్లు అని అభిప్రాయపడ్డారు. ఇంతకు మించి ఎవరైనా ఈ విజయం తమదేనని అనుకుంటే మాత్రం వాళ్ల ఖర్మ అని పరోక్షంగా వర్మను ఉద్ధేశించి నాగబాబు వ్యాఖ్యానించారు.

అదే సమయంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పై కూడా నాగబాబు విమర్శలు గుప్పించారు. జగన్‌ మోహన్‌రెడ్డి ఇంకా నిద్ర వీడలేదన్నారు. వైసీపీ హాస్యగాళ్ల గురించి చెప్పుకోకుండా స్పీచ్‌ను ముగించలేమన్న ఆయన.. జగన్‌ లాంటి హాస్య నటుడు కనే కలలు గురించి కూడా చెప్పకుండా ఉండలేమన్నారు. ఎన్నికల ముందు నుంచి నిద్రపోయి కలలు కంటుడున్నారని, ఇప్పటికీ ఆయన నిద్ర వీడలేదన్నారు. కళ్లు మూసి తెరిచే లోపు తొమ్మిది నెలలు అయిపోయాయని, అలానే ఐదేళ్లు అయిపోతాయని చెబుతున్నారన్నారు. ఇలాంటి హాస్యం ఏ సినిమాలో కూడా ఉండదని, సార్‌ మీరు ఇలానే నిద్రపోండి అంటూ ఎద్దేవా చేశారు. ఇరవై ఏళ్ల వరకు ఇలానే నిద్రపోవాలని సలహా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెబుతూనే ప్రత్యర్థులపై సెటైర్లు విసిరారు నాగబాబు. అధికారంలో లేనప్పుడు తీవ్రంగా మాట్లాడే శక్తి ఉంటుందని, ఇప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. పవన్‌ లాంటి వ్యక్తి స్థాయికి మనం చేరుకోలేనప్పుడు కనీసం ఆయన కోసం పనిచేస్తే కొంత మంచి చేసిన వాళ్లం అవుతామన్నారు. అదే తాను చేశానని పేర్కొన్నారు. 12 ఏళ్లు అంటే హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకత ఉందని, అందుకే 12వ ఆవిర్భావ సభ పుష్కరానికి ఉన్నంత పవిత్రమైన రోజుగా భావిస్తున్నామని అభివర్ణించారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్