Wayanad Landslides: హృదయవిదారకంగా వయనాడ్ ..చిన్నారుల మృతదేహాలు చూసి ఉపాధ్యాయులు కన్నీరు

తరగతి గదుల్లో కనిపించే..చిన్నారు..శవాగారంలో కనిపించడంతో ఉపాధ్యాయులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఏ ఉపాధ్యాయుడూ ఇలాంటి ఘోరాన్ని ఊహించరు. ప్రకృతి వైపరీత్యం సంభవించిన వాయనాడ్‌లోని ముండకై, చురల్ సెకండరీ స్కూల్ విద్యార్థులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఏ టీచ‌ర్‌కు ఇలాంటి పరిస్థితి రాకూడదని..పిల్లల ముఖంలో చిరునవ్వు చూసిన తాము..వారు శవాలుగా పడి ఉండటం చూడలేకపోతున్నామంటూ భోరున విలపిస్తున్నారు.

mundakkai

ప్రతీకాత్మక చిత్రం 

పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రపంచానికి ఆవిష్కరించే ఉపాధ్యాయులు ఇప్పుడు చిన్నారుల మృతదేహాలను గుర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. ముండకై ప్రభుత్వ జూనియర్ ప్రాథమిక పాఠశాల, చురల్ మాల ప్రభుత్వ ఒకేషనల్ హయ్యర్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయులు ఇప్పుడు మెప్పాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పిల్లల మృతదేహాలను గుర్తించి ఆరోగ్య సిబ్బందికి తెలియజేస్తున్నారు.ఎందుకంటే ఆ ఊరి పిల్లలూ, స్కూల్ కి వచ్చే వాళ్ళ పేరెంట్స్ కూడా టీచర్లకే తెలుసు కదా? అందుకే కన్నీళ్లన్నీ మింగేస్తూ చాలా బాధాకరమైన ఈ పని చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎవరికీ అక్కర్లేదంటూ ఏడుస్తున్నారు.

కొన్నేళ్లుగా ఈ పాఠశాలలో సేవలందిస్తున్న ఉపాధ్యాయులు ఇక్కడి పిల్లలకు  సుపరిచితులు. తండ్రి, తల్లిచకుటుంబ సభ్యులు తెలియదు. వాళ్లు పనిచేస్తున్న పాఠశాల బురద, బురదతో ధ్వంసమైంది. ఎక్కడ చూసినా భవనాల శిథిలాలే కనిపిస్తున్నాయి. ఈ షాక్ నుంచి తేరుకోకముందే చనిపోయిన చిన్నారులు ఎవరనేది తెలియాల్సి ఉంది. చాలా మంది చిన్నారుల ముఖాలు గుర్తుపట్టలేనంతగా దెబ్బతిన్నాయి. కొంతమంది పిల్లల శరీర భాగాలు వేర్వేరుగా ఉన్నాయి. పాఠశాలల్లో ఆ అందమైన ముఖాలను చూసిన ఉపాధ్యాయులు, తరగతి గదుల్లో గొప్ప వైభవం గురించి కలలు కన్న ఉపాధ్యాయులు ఈ దృశ్యాన్ని చూసి భరించలేకపోతున్నారు. 

ఈ విషయమై కోరల్ మాల స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనీష్ టికె స్థానిక మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ,ఇది హృదయ విదారకంగా ఉంది. మా కుటుంబ సభ్యులంతా కనిపించకుండా పోయారు. వారిని గుర్తించే వారు మరొకరు లేరు. మా విద్యార్థులు చాలా మంది కనిపించడం లేదు. కొంతమందిని విగత జీవులుగా చూడటం నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ కన్నీరుమున్నీరు అయ్యారు. ఇప్పుడు కోరల్ మాల స్కూల్ పూర్వ వైభవానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా పాఠశాల విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు జయరామన్ సి మాట్లాడుతూ.. పాఠశాల వార్షికోత్సవాన్ని గ్రామోత్సవంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ సమయంలో గ్రామస్తులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఆ గ్రామమే లేదు. విద్యార్థులు లేరు అంటూ బాధను దిగమింగుకుంటూ తెలిపారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్