వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఆయన చాలా కాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. కొద్దిరోజుల కిందట దేవాదాయ శాఖకు చెందిన ఉద్యోగ వ్యవహారంలో బయటకు వచ్చి మాట్లాడిన ఆయన పలు మీడియా సంస్థల్లో పని చేసే జర్నలిస్టులు, ఆ సంస్థల అధినేతలపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తాను ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఎంపీ విజయసాయిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఆయన చాలా కాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. కొద్దిరోజుల కిందట దేవాదాయ శాఖకు చెందిన ఉద్యోగ వ్యవహారంలో బయటకు వచ్చి మాట్లాడిన ఆయన పలు మీడియా సంస్థల్లో పని చేసే జర్నలిస్టులు, ఆ సంస్థల అధినేతలపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తాను ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆయన మౌనం దాలుస్తూ వచ్చారు. అయితే, తాజాగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన మరోసారి స్పందించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిరసిస్తూ గంటా శ్రీనివాసరావు మాదిరిగా టిడిపి ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన తన డిమాండ్ ను వినిపించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయాలనే కేంద్రం నిర్ణయానికి నిరసనగా అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరిలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారన్న విజయసాయిరెడ్డి.. ఆయన రాజీనామాను 2024 జనవరిలో స్పీకర్ ఆమోదించారన్నారు. అప్పటి గంటా శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకొని ప్రస్తుత వైజాగ్ పార్లమెంట్ సభ్యుడు భరత్, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెంటనే రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
అలా రాజీనామా చేయకపోయినా, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకపోయినా చరిత్ర వారిని ద్రోహులుగా, మోసగాళ్లుగా పరిగణిస్తుందన్నారు. ప్రజలు వారిద్దరిని క్షమించరని, వారు చేసిన ద్రోహానికి వారిద్దరికీ గట్టి గుణపాఠం చెబుతారు అంటూ విజయసాయి రెడ్డి కామెంట్ చేశారు. చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూసివేత ప్రక్రియ మొదలైందని, బ్లాస్ట్ ఫర్నిస్ ను నిలిపివేయడం, స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతు కోయడమే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు జాతికి ఇది అతి పెద్ద ద్రోహం అని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ యధావిధిగా గాలికి కొట్టుకుపోయినట్టేనని పేర్కొన్నారు. సంక్షోభం సమయంలో ఆయన మౌనం కేంద్ర ప్రభుత్వానికి, ఉక్కు మంత్రత్వ శాఖకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంగానే భావించవచ్చని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని దోహమంటూ విమర్శించారు. వేల మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డట్టేనని పేర్కొన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ఆలంబనగా వైజాగ్ లో ఎగసిపడిన ఆర్థిక వ్యవస్థ ఇక చిద్రమైనట్టేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు మోసాన్ని కాపాడే శక్తి ఉన్న నిర్లిప్తంగా ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించరని విమర్శించారు. టిడిపి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టిందంటూ ఘాటు విమర్శలు చేశారు. విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు పట్ల టిడిపి శ్రేణులు కూడా అంతే స్థాయిలో వ్యాఖ్యానిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైసిపి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా ఎందుకు ఆపలేకపోయిందంటూ పలువురు సామాజిక మాధ్యమాలు వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదిఏమైనా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ విజయసాయిరెడ్డి రాజకీయంగా యాక్టివ్ కావడం పట్ల వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.