ప్రముఖ నటుడు, మెగా మేనేల్లుడు సాయి ధరమ్‌తేజ్ చిన్నారులు తల్లిదండ్రులకు కీలక సూచన చేశారు. సామాజిక మాధ్యమాలు వినియోగించే వారి లక్ష్యంగా జరుగుతున్న కొన్ని ఇబ్బందికర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆయ న ఈ మేరకు తల్లిదండ్రులకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. పిల్లలు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు అప్రమత్తంగా వ్యవహరించాలని పేరెంట్స్‌కు సూచించారు.
ప్రముఖ నటుడు సాయి ధరమ్‌తేజ్
ప్రముఖ నటుడు, మెగా మేనేల్లుడు సాయి ధరమ్‌తేజ్ చిన్నారులు తల్లిదండ్రులకు కీలక సూచన చేశారు. సామాజిక మాధ్యమాలు వినియోగించే వారి లక్ష్యంగా జరుగుతున్న కొన్ని ఇబ్బందికర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆయ న ఈ మేరకు తల్లిదండ్రులకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. పిల్లలు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు అప్రమత్తంగా వ్యవహరించాలని పేరెంట్స్‌కు సూచించారు. నియంత్రించలేనంతగా సామాజిక మాద్యమాలు కూర్రంగా, భయానకంగా మారిపోయాయని, కొన్ని మానవ మృగాలు నుంచి పిల్లలను రక్షించుకోవాలని పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. పిల్లలు ఫొటోలు, వీడియోలను నెట్టింట్ పోస్ట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలన్నారు.
సోషల్ మీడియా మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదని, కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలంటూ తేజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. కొంత మంది యూట్యూబర్లు పిల్లల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూనో, పిల్లలతో కలిసి పేరెంట్స్ చేసిన వీడియోలపైనో అవమానకరంగా కామెంట్లు చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే సాయి ధరమ్‌తేజ్ ఈ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాలు వినియోగంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు తేజ్ ఈ మేరకు ట్వీట్ చేశారని పలువురు చెబుతున్నారు. చిన్నారుల భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువరు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ట్వీట్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఖాతాలకు ఆయన ట్యాట్ చేశారు. తేజ్ ట్వీట్‌పై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. పిల్లల భద్రత తమ ప్రభుత్వా లక్ష్యాల్లో ఒకటని, ఈ విషయాన్ని తమ దృష్టికి తెచ్చినందుకు దన్యవాదాలను తెలియజేశారు.