ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ (ఏఐ) టెక్నాలజీని వినియోగించి ఎంతోమంది భిన్న రంగాల్లో రాణిస్తుంటే.. కొందరు మాత్రం ఇదే టెక్నాలజీని వినియోగించి ప్రముఖులను అభాసు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సంబంధం లేని వ్యక్తులతో ఏఐను వినియోగించి ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ వారిపై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాలుగా ఈ తరహా దుష్ప్రచారం పరిధికి మించి జరుగుతుండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.
ఏఐ వినియోగించి తయారు చేసిన ఫేక్ ఫోటో
టెక్నాలజీ పెరుగుతున్న కొలది అందుకు అనుగుణంగానే అనర్ధాలు పెరుగుతున్నాయి. అభివృద్ధిని మంచికి వినియోగించుకున్నంత కాలం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ చెడు వ్యవహారాలకు టెక్నాలజీని, అభివృద్ధిని వినియోగించుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని తాజాగా జరుగుతున్న అనేక వ్యవహారాలను చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ (ఏఐ) టెక్నాలజీని వినియోగించి ఎంతోమంది భిన్న రంగాల్లో రాణిస్తుంటే.. కొందరు మాత్రం ఇదే టెక్నాలజీని వినియోగించి ప్రముఖులను అభాసు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సంబంధం లేని వ్యక్తులతో ఏఐను వినియోగించి ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ వారిపై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాలుగా ఈ తరహా దుష్ప్రచారం పరిధికి మించి జరుగుతుండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఐసీసీ ప్రెసిడెంట్ జై షా, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ కలిసి బీచ్ లో ఉన్నట్టుగా ఏఐ ద్వారా రూపొందించిన ఫోటోలు సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు.
ఈ ఫోటోలను చూసిన ఎంతోమంది అవాక్కవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఏఐను వినియోగించి సెలబ్రిటీలను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందంటూ పలువురు పేర్కొంటున్నారు. కొద్దిరోజుల కిందట టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీ, స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కలిసి ఉన్న ఫోటోను ఒకటి సోషల్ మీడియాలో వదిలారు. ఈ ఫోటోతో పాటు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ, దుబాయిలో ఇప్పటికే సహజీవనం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారాన్ని చేశారు. ఇదంతా ఏ ఐ ద్వారా చేసినదని తెలిసిన తరువాత చాలామంది అవాక్కయ్యారు. వీటితోపాటు ఏఐ డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. కొద్ది రోజుల కిందట సచిన్ టెండూల్కర్ ఒక బెట్టింగ్ యాప్ కు ప్రమోషన్ ఇస్తున్నట్టుగా వీడియోను టెక్నాలజీని వినియోగించి తయారుచేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇది కూడా ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఏఐ టెక్నాలజీ వినియోగించి క్రియేట్ చేసినట్టుగా తేలింది. ఈ తరహా ఫోటోలను క్రియేట్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని, అప్పుడే ప్రముఖులకు ఈ తరహా ఇబ్బందులు తప్పుతాయని పలువురు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ప్రముఖులకు ఇబ్బందికరంగా మారుతూ ఉందని పలువురు పేర్కొంటున్నారు.