కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సుమారు 17వేల వాట్సప్ ఖాతాలను కేంద్రం బ్లాక్ చేసింది. దీనికి ప్రధానమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖాతాలన్నీ ఆగ్నేయాసియా దేశాలకు చెందిన హ్యాకర్లవిగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వీటివల్ల దేశంలోని వినియోగదారులకు ఇబ్బందులు ఉండకూడదని ఉద్దేశంతో వాటిని బ్లాక్ చేసింది.
ప్రతికాత్మక చిత్రం
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సుమారు 17వేల వాట్సప్ ఖాతాలను కేంద్రం బ్లాక్ చేసింది. దీనికి ప్రధానమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖాతాలన్నీ ఆగ్నేయాసియా దేశాలకు చెందిన హ్యాకర్లవిగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వీటివల్ల దేశంలోని వినియోగదారులకు ఇబ్బందులు ఉండకూడదని ఉద్దేశంతో వాటిని బ్లాక్ చేసింది. ఆయా ఖాతాలు ద్వారా పలువురు కేటుగాళ్లు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఆఫర్లు, గేమ్ లు, డేటింగ్ యాప్ లు, ఫేక్ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ పేరుతో ఖాతాలు తెరిచి ప్రజలను ఆకర్షిస్తూ మోసగిస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు పోలీసులు ఇండియన్ సైబర్ క్రైమ్ కో - ఆర్డినేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ తో కలిసి ఆయా వాట్సప్ ఖాతాలను బ్లాక్ చేయాలని నిర్ణయించాయి. దీంతో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విభాగాల నివేదికల ప్రకారం సైబర్ డోస్ట్ 14c, టెలి కమ్యూనికేషన్ విభాగం సహాకారంతో ఆగ్నేయాసియాలో సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తులు జాబితాను రూపొందించినట్లు వెల్లడించారు. ఆ తరువాత వారి వాట్స్అప్ ఖాతాలను బ్లాక్ చేశారు. సైబర్ క్రైమ్ నెట్వర్కులకు అంతరాయం కలిగించిన వాటిని తొలగించి, భారతదేశ డిజిటల్ భద్రతను బలోపేతం చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని అధికారులు వెల్లడించారు. కంబోడియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, లావోస్ వంటి సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల నుంచి సైబర్ నారాల ఘటనలు వెలుగులోకి వచ్చిన తర్వాత భారత హోమ్ మంత్రిత్వ శాఖ ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పూర్తిస్థాయిలో విచారణ అనంతరం భారత్లో 45% సైబర్ నేరాలు ఆగ్నేయాసియా దేశాలకు చెందిన వ్యక్తులే చేస్తున్నట్లు తేలింది. సదరు వ్యక్తులు చేస్తున్న సైబర్ నేరాలు వల్ల భారతీయులు భారీగా నష్టపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
ఈ క్రమంలోనే 14 c హ్యాకర్లు పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ లాభాలను సంపాదించవచ్చని ఆకర్షిస్తున్నట్లు గుర్తించారు. ఆన్లైన్ గేమ్ లతో ప్రజలను ఆకర్షిస్తూ డబ్బును లాగేస్తూ మోసం చేస్తున్నారు. వ్యక్తులు తమ జీవిత భాగస్వామిని కలుసుకోవడానికి, వివాహం చేసుకోవడానికి వారిని ఆకర్షించడం ద్వారా డేటింగ్ యాపుల్లో కూడా చీటింగ్ చేస్తున్నారు. ఫేక్ వ్యాపార వేదికల ద్వారా ప్రధాన మోసం చేసేందుకు ప్లాన్ చేసినట్లు గుర్తించాయి ఈ సంస్థలు. ఇటువంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఆయా వాట్సప్ అకౌంట్లను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా వదంతంలో పని వెతుక్కుంటూ కంబోడి యొక్క పంపిస్తామంటూ భారతీయ యువకులను ప్రలోభ పెట్టి డబ్బులు దండుకున్నట్లు తేలింది. దురాశతో కంబోడియా చేరుకొని మోసపోయి నిరసన తెలిపిన భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. కంబోడియాలో నివసిస్తున్న ఆ పౌరులను రక్షించడానికి, వారిని స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే అసలు ఏం జరిగిందని ఆరా తీయగా ఈ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతోపాటు మరికొన్ని పాత కేసులు కూడా బయటపడడంతో అలాంటి వాట్సప్ ఖాతాలను బ్లాక్ లిస్ట్ చేశారు. దీంతోపాటు సైబర్ దాడులు చేస్తున్న వారిని అరెస్టు చేసేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.