ఇవాళ(శుక్రవారం) తెలంగాణ డీజీపీ జితేందర్‌కి రిపోర్టు చేసిన తర్వాత.. సిరాజ్ అధికారికంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు
డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మహ్మద్ సిరాజ్
టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ డీజీపీ జితేందర్‌కి రిపోర్టు చేసిన తర్వాత.. సిరాజ్ అధికారికంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు. సిరాజ్‌కు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. తాజాగా, మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో హైదరాబాద్కు చెందిన స్టార్ బౌలర్ సిరాజ్ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన సిరాజ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సిరాజ్‌కు క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో 600చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది.
అంతర్జాతీయ క్రికెట్లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన సిరాజ్ను రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ క్రమంలో సిరాజ్కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రెండు హామీలను ప్రభుత్వం నెరవేర్చింది. టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో హైదరాబాద్కు చెందిన స్టార్ బౌలర్ సిరాజ్ కూడా సభ్యుడిగా ఉన్నారు.