గడిచిన కొన్నాళ్లుగా హెల్త్ ఇన్సురెన్స్ తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, ఈ మధ్య కాలంలో ఆరోగ్యానికి సంబంధించిన బీమాతోపాటు సెల్‌ఫోన్‌కు ఇన్సురెన్స్ తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. భారీ ధర పెట్టి ఫోన్ కొనుగోలు చేస్తున్న వాళ్లు చాలా మంది మొబైల్ ఇన్సురెన్స్ తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇది తప్పనిసరి అవుతోంది. అయితే, మొబైల్ ఇన్సురెన్స్ తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ బీమా కోసం ఎంత ఖర్చు పెట్టాలి, డబ్బు ఎంత ఆదా అవుతందన్న విషయాలు మీ కోసం. ఒక స్టోర్ నుంచి లేదా ఈ కామర్స్ వెబ్‌సైట్ నుంచి కొత్త ఫోన్ కొనుగోలు చేసినప్పుడు ఆ షాపు యజమాని కానీ, ఆన్‌లైన్ విక్రేతలు గానీ బీమా గురించి చెబుతుంటారు. బీమా తీసుకుంటే ఎంతో మేలు అని చెబుతుంటారు.
ప్రతీకాత్మక చిత్రం
గడిచిన కొన్నాళ్లుగా హెల్త్ ఇన్సురెన్స్ తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, ఈ మధ్య కాలంలో ఆరోగ్యానికి సంబంధించిన బీమాతోపాటు సెల్‌ఫోన్‌కు ఇన్సురెన్స్ తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. భారీ ధర పెట్టి ఫోన్ కొనుగోలు చేస్తున్న వాళ్లు చాలా మంది మొబైల్ ఇన్సురెన్స్ తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇది తప్పనిసరి అవుతోంది. అయితే, మొబైల్ ఇన్సురెన్స్ తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ బీమా కోసం ఎంత ఖర్చు పెట్టాలి, డబ్బు ఎంత ఆదా అవుతందన్న విషయాలు మీ కోసం. ఒక స్టోర్ నుంచి లేదా ఈ కామర్స్ వెబ్‌సైట్ నుంచి కొత్త ఫోన్ కొనుగోలు చేసినప్పుడు ఆ షాపు యజమాని కానీ, ఆన్‌లైన్ విక్రేతలు గానీ బీమా గురించి చెబుతుంటారు. బీమా తీసుకుంటే ఎంతో మేలు అని చెబుతుంటారు. అయితే, ఎందుకు అని చాలా మంది తిరస్కరిస్తుంటారు. వాస్తవానికి వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసే మొబైల్ ఫోన్‌కు మరో వేయి నుంచి రెండు వేలు పెట్టి ఇన్సురెన్స్ చేస్తే తప్పు లేదని చాలా మందికి తెలియదు. మొబైల్ ఫోన్ ఖరీదుకు అనుగుణంగా ఇన్సురెన్స్ చేయించుకోవడం మంచిది. బీమా కూడా బ్రాండెడ్ కంపెనీ నుంచి తీసుకోవడం చాలా మంచిది. ఆపిల్ కేర్ లేదా ఆపిల్‌తో వచ్చే శాంసంగ్ కేర్ ప్లాన్ లాంటి నుంచి బీమా తీసుకుంటే పూర్తి బాధ్యత కంపెనీ చూసుకుంటుంది. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ ఆయా మొబైల్ కంపెనీలు పట్టించుకోవు. కాబట్టి బ్రాండెడ్ బీమా కాస్త ఖరీదైనదిగానే ఉంటాయి. వాటి ధర రూ.7 వేలు నుంచి రూ.20 వేలు వరకు ఉంటుంది. కాబట్టి, ఫోన్ ఖరీదును బట్టి బీమా తీసుకోవడం మంచిది. అలాంటి ప్లాన్ తరువాత కూడా బీమా క్లెయిమ్ చేసుకుంటే ఫోన్ రిపేర్ చేయడానికి లేదా మార్పిడి చేసుకోవడానికి రెండు నుంచి మూడు వేలు ఖర్చు చేయాల్సి రావచ్చు. సర్వీస్ చార్జ్, టాక్స్ రూపంలో ఆయా సంస్థలు తీసుకుంటాయి.
బీమాతో ఉపయోగాలు..
మొబైల్‌కు బీమా తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. మొబైల్ చోరీ అయినా, పోగొట్టుకున్నా ఇన్సురెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదాంటే జేబు నుంచి ఆ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. పొరపాటున ఫోన్ కిందపడినా, నీటిలో పడినా మరో విధంగా డ్యామేజ్ జరిగినా ఖర్చులను ఇన్సురెన్స్ కంపెనీ భరస్తుంది. మీరు తీసుకునే ఇన్సురెన్స్‌పై ఆ ఖర్చు ఆధారపడి ఉంటుంది. రూ.50 వేలకు మించిన ఖరీదు కలిగిన మొబైల్స్‌కు ఇన్సురెన్స్ బాగా ఉపయోగపడుతుంది. వాటి రిపేర్, రీప్లేస్‌మెంట్ ఖర్చు అధికంగా ఉంటుంది. కాబట్టి, ఇన్సురెన్స్ తీసుకోవడం మేలు. పెద్ద బ్రాండెండ్ కంపెనీలకు మాత్రమే ఇన్సురెన్స్ ఉపయోగపడుతుంది. కొన్ని ఇన్సురెన్స్ కంపెనీలు ఓటీటీ ప్లాన్‌లతో కలిపి ఇస్తున్నాయి. వాటి కోసం ఆన్‌లైన్‌లో వెతికి బ్రాండెడ్ తీసుకోవడం మంచిది.