రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నేషనల్ మీడియాతో మాట్లాడిన ఈ మేరకు రేవంత్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి దశ్చర్య వల్ల హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, 400 ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయించినట్లు ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం పైన ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములో ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి వెళ్లకుండా 400 ఎకరాల భూమిని కాపాడింది భారతీయ రాష్ట్ర సమితి ప్రభుత్వం అని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఆ భూముల పరిరక్షణ కోసం కేసీఆర్ నిర్దేశం మేరకు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదనలు వినిపించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

MLC Kavitha

ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నేషనల్ మీడియాతో మాట్లాడిన ఈ మేరకు రేవంత్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి దశ్చర్య వల్ల హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, 400 ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయించినట్లు ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం పైన ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములో ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి వెళ్లకుండా 400 ఎకరాల భూమిని కాపాడింది భారతీయ రాష్ట్ర సమితి ప్రభుత్వం అని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఆ భూముల పరిరక్షణ కోసం కేసీఆర్ నిర్దేశం మేరకు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదనలు వినిపించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇది యూనివర్సిటీ భూమి అని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళవద్దన్న ఉద్దేశంతో భారతీయ రాష్ట్ర సమితి ప్రభుత్వం న్యాయ పోరాటం చేసిందన్నారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 397 ఎకరాలను ఇతర చోట యూనివర్సిటీకి ఇచ్చామని ప్రభుత్వం వితండవాదం చేస్తోందని, పరిశ్రమలు ఏర్పాటు, భూముల విక్రయం వంటివన్నీ ఆ 397 ఎకరాల్లోనే చేసుకోవాలన్నారు.

ప్రభుత్వం పర్యావరణం, ప్రకృతి కోణంలో కూడా ఆలోచించాలి అని కవిత సూచించారు. ఈ భూముల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంక్రీట్ జంగిల్ గా మారిన గచ్చిబౌలి ప్రాంతంలో ఈ 400 ఎకరాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు అయితే వాతావరణంపై ఎంత ఒత్తిడి పెరుగుతుందో ఆలోచించాలన్నారు. భారతీయ రాష్ట్ర సమితి హయాంలో మై హోమ్ విహంగా నిర్మాణానికి భూములు కేటాయించాం అనడంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మై హోమ్ విహంగ ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపించాలని డిమాండ్ చేశారు. మై హోమ్ రామేశ్వరరావు బిజెపి మనిషి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేయలేకపోతున్నారని ఆరోపించారు. పేదలు, మూగ జీవులు ఉంటేనేమో బుల్డోజర్లను ప్రయోగిస్తారని ఆరోపించారు. పెద్దవాళ్లను మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ముట్టుకోరని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్వానంగా తయారయిందని ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పిన హామీలను పూర్తిగా రేవంత్ రెడ్డి విస్మరించారని, ప్రజలు ప్రభుత్వం పట్ల తీవ్ర అసహనంతో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ రాష్ట్ర సమితికి అధికారాన్ని కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఆ పార్టీకి చెందిన నేతలు కూడా అసహనంతో ఉన్నట్లు వెల్లడించారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్