ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ తర్జనభర్జన.. నేడు తేల్చే అవకాశం.!

తెలంగాణలో కొద్ది రోజుల్లో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆశావహులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాన్ని బట్టి చూస్తే నాలుగు స్థానాలు కచ్చితంగా గెలిచేందుకు అవకాశం ఉంది. అయితే భారతీయ రాష్ట్ర సమితి రెండవ స్థానానికి పోటీ పెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎన్నిక అనివార్యం అవుతుంది. ఈ నేపథ్యంలో నాలుగు స్థానాలు గెలుచుకోవడం పై కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రచించాల్సి ఉంది. అదే సమయంలో బలమైన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది.

CM Revant Reddy in Delhi

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో కొద్ది రోజుల్లో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆశావహులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు  కావడంతో ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాన్ని బట్టి చూస్తే నాలుగు స్థానాలు కచ్చితంగా గెలిచేందుకు అవకాశం ఉంది. అయితే భారతీయ రాష్ట్ర సమితి రెండవ స్థానానికి పోటీ పెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎన్నిక అనివార్యం అవుతుంది. ఈ నేపథ్యంలో నాలుగు స్థానాలు గెలుచుకోవడం పై కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రచించాల్సి ఉంది. అదే సమయంలో బలమైన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. ఆశావహుల సంఖ్య 20 వరకు ఉండడం, ఎమ్మెల్సీ స్థానాలు నాలుగే ఉండడంతో ఎవరికి అభ్యర్థిత్వాన్ని ఇవ్వాలి అన్నదానిపై సీఎం రేవంత్ రెడ్డి తర్జనభర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆయన ఆదివారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు. మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఆయన చర్చించనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను పార్టీ అగ్ర నాయకులతో సమావేశం అనంతరం ఖరారు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పార్టీ సీఈసీ సభ్యుడు ఉత్తంకుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో వీరి పర్యటన రద్దయింది.

వీరితో ఫోన్ సంభాషణ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోమవారంతో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులను ఆదివారం ఖరారు చేయడం ద్వారా సోమవారం నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తెలంగాణకు చెందిన పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే పార్టీ నేతలు అభిప్రాయాలను ఏఐసిసి సంస్థ గత వ్యవహారాల ఇన్చార్జి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ కు మీనాక్షి నటరాజన్ అందజేయనున్నారు. అనంతరం అంతిమంగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. అభ్యర్థులను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే ఖరారు చేస్తారు. బీసీ, ఎస్సీ, మైనారిటీ, మహిళ అభ్యర్థులను ఎంపిక చేసే ఆలోచనలు అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో చేపట్టిన ఒప్పందంలో భాగంగా సిపిఐ కి ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఈ విడతలో పార్టీ కోసం కష్టపడి పని చేసి గడిచిన ఎన్నికల్లో సీట్లను త్యాగం చేసే వారికి అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. అయితే ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఖరారు చేస్తుందో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్