||ప్రతీకాత్మక చిత్రం|| క్రెడిట్ కార్డు వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త తెలిపింది. రోజురోజుకు మన దేశంలో క్రెడిట్ కార్డు వాడకం పెరిగింది. అలాగే క్రెడిట్ కార్డు గడువు తేది మర్చిపోయి పెనల్టీ కూడా కట్టే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. క్రెడిట్ కార్డు బిల్లు తేదీ ముగిసిన బిల్లు కట్టాని మరుసటి నుండే పెనాల్టీ పడిందా.. మీరు బిల్లు కట్టకుండా మర్చిపోయి రూ.1000 పైనే పెనాల్టీ చెల్లించాల్సి వస్తోంది. అలాగే క్రెడిట్ స్కోర్ పై ప్రభావం పడుతుంది. అయితే క్రెడిట్ కార్డు వినియోగదారులకు క్రెడిట్ కార్డ్ ముగింపు తేది గడిచిన మూడు రోజుల తర్వాత బిల్లు చెల్లించుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. కానీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డు బిల్లు తేదీ ముగిసిన మూడు రోజుల తర్వాతే బిల్లు కట్టని యెడల పెనాల్టీ వసూలు చేయాలని ఆదేశించింది.
ఎక్కువ క్రెడిట్ కార్డుల వల్ల తేదీలు మర్చిపోతున్నారా.. అయితే ఆర్బీఐ ఇంకో ఆఫర్ కూడా ఇచ్చింది. క్రెడిట్ కార్డుల బిల్లు పే చేయడానికి ఒకే తేదీని సెట్ చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది. ఈ తేదీలను మార్చుకునే అవకాశం ఒకసారి మాత్రమే ఉంటుందని తెలిపింది.