దేశ బ్యాంకింగ్ రంగంలో మరో కీలక మార్పు మే ఒకటో తేదీన చోటు చేసుకోబోతోంది. దేశవ్యాప్తంగా 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనం ప్రక్రియ జరగనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ), కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను అందిస్తూ సామాన్య ప్రజలకు ముఖ్యంగా రైతులకు చిన్న వ్యాపారులకు సహాయపడుతున్నాయి ఈ బ్యాంకుల తొలగింపు వల్ల ఖాతాదారులపై ఇటువంటి ప్రభావం ఉంటుంది అన్న ఆందోళన సర్వత్ర వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో దాని గురించి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో 1975లో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డాయి.
ప్రతీకాత్మక చిత్రం
దేశ బ్యాంకింగ్ రంగంలో మరో కీలక మార్పు మే ఒకటో తేదీన చోటు చేసుకోబోతోంది. దేశవ్యాప్తంగా 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనం ప్రక్రియ జరగనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ), కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను అందిస్తూ సామాన్య ప్రజలకు ముఖ్యంగా రైతులకు చిన్న వ్యాపారులకు సహాయపడుతున్నాయి ఈ బ్యాంకుల తొలగింపు వల్ల ఖాతాదారులపై ఇటువంటి ప్రభావం ఉంటుంది అన్న ఆందోళన సర్వత్ర వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో దాని గురించి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో 1975లో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందించడం, రైతులకు, చిన్న వ్యాపారులకు, కార్మికులకు రుణాలు ఇవ్వడం, ఆర్థిక చైతన్యం తీసుకురావడం ఈ బ్యాంకుల ప్రధాన ఉద్దేశం. ఈ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్పాన్సర్ బ్యాంకులుగా ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంకులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్రను పోషిస్తూ వస్తున్నాయి. అయితే మే ఒకటో తేదీ 2025 నుంచి 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో విలీనం కానున్నాయి. అంటే దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒకటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు యొక్క పై ఉంటుంది. ఈ క్రమంలో ఆర్ఆర్బీ బ్యాంకులు 43 నుంచి 28 కి తగ్గుతాయి. శాఖల విషయంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఖాతాదారులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ నిర్ణయానికి అనేక అంశాలు దోహదం చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న గ్రామీణ బ్యాంకులు విడివిడిగా నడపడం కంటే వాటిని ఒకే బ్యాంకుగా విలీనం చేస్తే నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. ఇది బ్యాంకుల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తాయి.
అనేక గ్రామీణ బ్యాంకులో పాత సాంకేతికతతో నడుస్తున్నాయి. విలీనం ద్వారా ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగదారులకు అందించే అవకాశం ఉంటుందని ఆర్బిఐ భావించింది. అలాగే ఒకే బ్రాండ్ తో గుర్తింపు పొందడం అవకాశం ఉంటుంది. ఒక రాష్ట్రం - ఒక గ్రామీణ బ్యాంకు అనే ఆలోచనతో ఒకే బ్యాంకుగా మార్చడం ద్వారా బ్రాండ్ గుర్తింపు పెరుగుతుంది. అదే సమయంలో నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గుతాయి. వివిధ రాష్ట్రాల్లో వివిధ బ్యాంకులు వేరువేరు విధానాలతో నడుస్తున్నాయి. విలీనం ద్వారా ఒకే విధానం అమలు చేయబడుతుంది. అలాగే సాధారణంగా బ్యాంకు విలీనాలు ఖాతాదారులకు కొన్ని సవాళ్లను, కొన్ని అవకాశాలను తెచ్చిపెడతాయి. విలీనం తర్వాత బ్యాంకులు ఆధునిక సాంకేతికతను అవలంబించే అవకాశం ఉంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వాటి సేవలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సులభంగా అందుబాటులోకి వస్తాయి. ఎక్కువ శాఖలు ఏటీఎంలు, స్పాన్సర్ బ్యాంకులతో విలీనం అయితే ఖాతాదారులు ఆ విస్తృత శాఖల నెట్వర్క్ ను, ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం అయితే ఖాతాదారులు దేశవ్యాప్తంగా ఉన్న పీఎన్బీ శాఖలను ఉపయోగించుకోవచ్చు. విలీనం ద్వారా బ్యాంకుల ఆర్థిక స్థితి బలపడుతుంది.
దీనివల్ల రుణాలు తీసుకునే వారికి తక్కువ వడ్డీ రేట్లు, మెరుగైన రుణ సౌకర్యాలు లభించే అవకాశం ఉంది. వివిధ బ్యాంకుల్లో వేరువేరు నిబంధనలు ఉండవు. ఒకే జాతీయ బ్యాంకు లేదా స్పాన్సర్ బ్యాంకు విధానాలు అమలవుతాయి. ఇది ఖాతాదారులకు సౌలభ్యం కల్పిస్తుంది. ఈ విలీనం ప్రభుత్వం, ఆర్బిఐ మద్దతుతో జరుగుతుంది కాబట్టి ఖాతాదారుల డబ్బులు సురక్షితంగా ఉంటాయి. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు డిపాజిట్లు భీమా కింద ఉంటాయి. స్థానిక శాఖల మూసివేత విలీనం తర్వాత జరుగుతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంత ఖాతాదారులు బ్యాంకు సేవలు కోసం దూరం ప్రయాణించాల్సి రావచ్చు. విలీన ప్రక్రియ సమయంలో ఖాతా వివరాలు, పాసుబుక్కులు వంటివి మార్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కొంత గందరగోళం జరిగే అవకాశం ఉంది. దీనివల్ల వినియోగదారులకు కొంత ఇబ్బంది కలగవచ్చు. ఈ విలీనం వల్ల బ్యాంకు ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగ భద్రత ప్రభావం పడుతుంది. ఇది పరోక్షంగా సేవల నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. డిజిటల్ సేవలకు అలవాటు పడేవిధంగా ఈ విలీన ప్రక్రియ ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించడం కొంతమంది వినియోగదారులకు సవాల్ గా మారవచ్చు.