ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి.. కోటి విరాళం అందజేత

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మెగాస్టార్ చిరంజీవి కలిశారు. కొద్దిరోజుల కిందట రాష్ట్రంలో వరదల వల్ల అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఆయ ప్రాంతాల్లోని ప్రజలకు సహాయం అందించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి విరారాలను ప్రకటించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఏపీకి తన వంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మతాన్ని శనివారం రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి చిరంజీవి చెక్కును అందించారు.

Chiranjeevi who met CM Chandrababu Naidu
సీఎం చంద్రబాబు నాయుడు కలిసిన చిరంజీవి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మెగాస్టార్ చిరంజీవి కలిశారు. కొద్దిరోజుల కిందట రాష్ట్రంలో వరదల వల్ల అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఆయ ప్రాంతాల్లోని ప్రజలకు సహాయం అందించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి విరారాలను ప్రకటించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఏపీకి తన వంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మతాన్ని శనివారం రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి చిరంజీవి చెక్కును అందించారు. ఈ మొత్తంలో మెగాస్టార్ చిరంజీవి వంతు రూ.50 లక్షల రూపాయలు, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తరఫున రూ.50 లక్షల రూపాయలను చిరంజీవి అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మెగాస్టార్ చిరంజీవిని అభినందించారు. అనంతరం వీరిద్దరూ కొద్ది నిమిషాలపాటు అనేక అంశాలపై చర్చించారు. సేవా కార్యక్రమాల్లో ముందుండే చిరంజీవి వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం పట్ల సీఎం నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

అంతకుముందు విరాళం అందించేందుకు తన నివాసానికి వచ్చిన చిరంజీవికి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. భేటీ అనంతరం కారు వరకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లి వీడ్కోలు పలికారు. వీరిద్దరూ సమావేశం కావడం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. అనేక అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వానికి కూడా మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సహాయాన్ని అందించారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులకు తన వంతు సాయంగా 50 లక్షలు రూపాయలను కొద్ది రోజుల క్రిందట సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆయన అందించారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి ఈ మొత్తాన్ని అందించారు. మెగాస్టార్ కుటుంబం సుమారు రెండు కోట్ల వరకు ఇరువు రాష్ట్రాలకు అందించింది. ఇందులో రామ్ చరణ్ కోటి రూపాయలు, మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు చొప్పున ఇరు రాష్ట్రాలకు విరారాలను ప్రకటించి అందించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్