రైల్వే శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వాళ్ళ పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగానే రైల్వే శాఖ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9,970 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తులను ఏప్రిల్ 12వ తేదీ నుంచి తీసుకోవడం ప్రారంభమైంది. మే 11వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించుకునేందుకు అవకాశం ఉంది. మెట్రిక్యులేషన్ తోపాటు సంబంధిత క్రెడుల్లో ఐటిఐ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. మూడేళ్ల డిప్లమో అర్హత ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
రైల్వే శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వాళ్ళ పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగానే రైల్వే శాఖ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9,970 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తులను ఏప్రిల్ 12వ తేదీ నుంచి తీసుకోవడం ప్రారంభమైంది. మే 11వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించుకునేందుకు అవకాశం ఉంది. మెట్రిక్యులేషన్ తోపాటు సంబంధిత క్రెడుల్లో ఐటిఐ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. మూడేళ్ల డిప్లమో అర్హత ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో గంగా రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు వేతనం చెల్లిస్తారు.
అహ్మదాబాద్, అజ్మీర్, బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీఘడ్, చెన్నై, గౌహతి, జమ్మూ అండ్ శ్రీనగర్, కలకత్తా, మాల్దా, ముంబై, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్ వంటి రీజియన్ లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ తో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటిఐ ఇతర కోర్సులు పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి జులై ఒకటో తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు వయసు ఉండాలి. కేంద్ర ప్రభుత్వా నిబంధనల ప్రకారం బయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 3 - 6 - 8 ఏళ్లు, రైల్వేలో గ్రూప్ సి, గ్రూప్ డి విభాగంలో పనిచేస్తున్న వారికి 40, 43, 45 ఏళ్లు, వితంతువులు, ఒంటరి మహిళలకు 35, 38, 40 సంవత్సరాలు, 25 ఏళ్లలోపు ఉండి అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి 35, 38, 40 ఎల్లపాటు వైయస్వరలింపు వర్తిస్తుంది. దరఖాస్తు చేసేందుకు 500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టి, మాజీ సైనికు ఉద్యోగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్స్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ ఆధారత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.