ఈ మధ్యకాలంలో బ్యాంకుల అవసరాలు ప్రజలకు పెరుగుతున్నాయి. వివిధ రకాల లావాదేవీలను నిర్వహించేందుకు బ్యాంకులకు వెళుతుంటారు. అయితే బ్యాంకు సెలవలపట్ల అవగాహన లేకపోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంకులకు సంబంధించి సెలవు రోజులను ముందుగానే తెలుసుకోవడం ద్వారా బ్యాంకు కార్యకలాపాలను ముందస్తుగానే పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏ నెలకి సంబంధించి బ్యాంకులకు ఎప్పుడు ఎప్పుడు సెలవులు ఉన్నాయి అన్నదానిపై చాలామందికి అవగాహన ఉండడం లేదు. మే నెలలో శని ఆదివారాలతోపాటు ఇతర సెలవు రోజులు కలిపి సుమారు 12 నుంచి 13 రోజులు వరకు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మే 2025 కు సంబంధించి బ్యాంకు సెలవల జాబితాను అధికారికంగా విడుదల చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
ఈ మధ్యకాలంలో బ్యాంకుల అవసరాలు ప్రజలకు పెరుగుతున్నాయి. వివిధ రకాల లావాదేవీలను నిర్వహించేందుకు బ్యాంకులకు వెళుతుంటారు. అయితే బ్యాంకు సెలవలపట్ల అవగాహన లేకపోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంకులకు సంబంధించి సెలవు రోజులను ముందుగానే తెలుసుకోవడం ద్వారా బ్యాంకు కార్యకలాపాలను ముందస్తుగానే పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏ నెలకి సంబంధించి బ్యాంకులకు ఎప్పుడు ఎప్పుడు సెలవులు ఉన్నాయి అన్నదానిపై చాలామందికి అవగాహన ఉండడం లేదు. మే నెలలో శని ఆదివారాలతోపాటు ఇతర సెలవు రోజులు కలిపి సుమారు 12 నుంచి 13 రోజులు వరకు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మే 2025 కు సంబంధించి బ్యాంకు సెలవల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం మే నెలలో శనివారాలు, ఆదివారాలతో కలిపి 12 నుంచి 13 రోజులు వరకు బ్యాంకులు బంద్ ఉంటాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రాంతీయ పండుగలు, సాంస్కృతిక వేడుకలు ఈ సెలవులను నిర్ణయిస్తాయి. ఇక మే నెలకు సంబంధించి బ్యాంకులకు సెలవు రోజులుగా ప్రకటించిన వివరాలను పరిశీలిస్తే.. మే ఒకటో తేదీన కార్మిక దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. కాబట్టి మే ఒకటో తేదీన సెలవు రోజుగా ప్రకటించారు. ఈ సెలవులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, గోవా, మణిపూర్, గుజరాత్, కేరళ, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, పశ్చిమబెంగా, అస్సాం వంటి రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులుగా ప్రకటించారు. మే నాలుగో తేదీన ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా ఆదివారం వీకెండ్ సెలవుగా ప్రకటించారు. అలాగే మే 8వ తేదీన అరవింద్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని పశ్చిమబెంగాల్, త్రిపుర, న్యూఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో సెలవులు ప్రకటించారు. ఆర్బిఐ నిబంధనల ప్రకారం ప్రతినెల 2, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు రోజులుగా ప్రకటించారు. కాబట్టి మే 10వ తేదీన రెండో శనివారం కావడంతో సెలవు గా ప్రకటించారు.
మే 11న ఆదివారం కావడంతో మరోసారి బ్యాంకులు మూసివేయబడతాయి. మే 12వ తేదీ సోమవారం బుద్ధ పూర్ణమన పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించాయి. ఈ రాష్ట్ర జాబితాలో మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, చతిస్గడ్, ఝార్ఖండ్ మేఘాలయ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వెంట రాష్ట్రాలు ఉన్నాయి. మే 18వ తేదీన ఆదివారం కావడంతో వారాంతపు సెలవు ప్రకటించారు. ఈరోజు కూడా బ్యాంకులు మూసి వేయబడతాయి. మే 24వ తేదీ నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు మంజూరు చేయబడ్డాయి. మే 25వ తేదీ ఆదివారం మరోసారి వారాంతపు సెలవు లభిస్తుంది. మే 26వ తేదీ కాజీ నజరాల్ ఇస్లాం జయంతి పురస్కరించుకొని త్రిపురలో బ్యాంకులకు సెలవు ప్రకటించాయి. మే 29న గురువారం మహారాణా ప్రతాప్ జయంతులు పురస్కరించుకొని హిమాచల్ ప్రదేశ్లో బ్యాంకులకు సెలవులు ఇస్తారు. బ్యాంకు సెలవు రోజుల్లో ఆర్థిక లావాదేవులకు సంబంధించి కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. కాబట్టి ముందుగానే బ్యాంకు కార్యకలాపాలను చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకుల బ్రాంచులు మూసి వేయబడినప్పటికీ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని ఆర్బిఐ స్పష్టం చేసింది. కాబట్టి ఈ సెలవుల పట్ల అవగాహన కలిగి ఉండడం ద్వారా బ్యాంక్ కారికాల పాలను ముందుగానే నిర్వర్తించుకునేందుకు అవకాశం ఉంటుంది.