చత్తీష్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్.. పదిమంది మావోయిస్టుల మృతి

చత్తీష్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బీజాపూర్ దంతివాడ జిల్లా లావా పురెంగల్ వద్ద మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు. వరంగల్ అటవీ ప్రాంతంలో రిజర్వు గార్డు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, బిఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి.

Forces conducting combing in Chhattisgarh

చత్తీష్ ఘడ్ లో కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలు

చత్తీష్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బీజాపూర్ దంతివాడ జిల్లా లావా పురెంగల్ వద్ద మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు. వరంగల్ అటవీ ప్రాంతంలో రిజర్వు గార్డు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, బిఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్ లో భద్రత బలగాలు జరిపిన కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రాథమికంగా అందిన సమాచారం. మావోయిస్టుల మృతదేహాలతోపాటు భారీగా ఆయుధాలు, వస్తు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. 

మంగళవారం ఉదయం 10:30 గంటలకు మొదలైన ఎన్కౌంటర్ రెండు గంటల వరకు కొనసాగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటివరకు పదిమంది మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆగస్టు 29న నారాయణపూర్ జిల్లా అబూజ్ మాడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు - మావోయిస్టులు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. తాజాగటంతో కలిపి చత్తిస్గడ్ లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన ఈదురుకాల్పుల్లో 154 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టులు లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన కొద్ది రోజుల నుంచి ఛత్తీస్గడ్ అటవీ ప్రాంతంలో ప్రత్యేక కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కూంబింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారం ఉంటే ఎదురు కాల్పులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు, పోలీసులు మధ్య కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కాల్పుల్లో భారీగా మావోయిస్టులు ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా జరిగిన కాల్పుల్లో పదిమంది మృతిచెందగా, మరో ఐదుగురు వరకు మృతి చెందే అవకాశం ఉందని తెలుస్తోంది. మృతదేహాలను గుర్తించాల్సి ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ కాల్పులకు సంబంధించి పోలీసులు అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్