ఏప్రిల్ లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ముందే మేల్కొండి.!

బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలు జరిపే వారి సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. ప్రతిరోజు వివిధ అవసరాల రీత్యా బ్యాంకులకు వెళ్లే వినియోగదారులు భారీగా ఉన్నారు. రోజువారి అవసరాల రిత్యా బ్యాంకులకు వెళ్లేవారు బ్యాంకులకు సంబంధించిన సెలవులు పట్ల అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే అత్యవసర సేవలను పొందలేక కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు పట్ల అవగాహన కలిగి ఉండి ముందుగానే తమ బ్యాంకు కార్యకలాపాలను పూర్తి చేసుకోవాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే బ్యాంకు సెలవు రోజుల్లో అవసరాలు ఏర్పడి ఇబ్బందులు పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలు జరిపే వారి సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. ప్రతిరోజు వివిధ అవసరాల రీత్యా బ్యాంకులకు వెళ్లే వినియోగదారులు భారీగా ఉన్నారు. రోజువారి అవసరాల రిత్యా బ్యాంకులకు వెళ్లేవారు బ్యాంకులకు సంబంధించిన సెలవులు పట్ల అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే అత్యవసర సేవలను పొందలేక కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు పట్ల అవగాహన కలిగి ఉండి ముందుగానే తమ బ్యాంకు కార్యకలాపాలను పూర్తి చేసుకోవాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే బ్యాంకు సెలవు రోజుల్లో అవసరాలు ఏర్పడి ఇబ్బందులు పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఏప్రిల్ నెలలో మొత్తంగా తొమ్మిది రోజులు పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. కాబట్టి ఆయా సెలవు రోజుల్లో మినహా మిగిలిన రోజుల్లో ముందుగానే బ్యాంకు సేవలను వినియోగించుకుని తమ అవసరాలను తీర్చుకోవడం మంచిది. 

ఇవి ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవు రోజులు..

ఏప్రిల్ నెలలో బ్యాంకులకు తొమ్మిది రోజులు పాటు సెలవులో ఉన్నాయి. ఏప్రిల్ 6 న ఆదివారం కావడంతోపాటు శ్రీరామనవమి కూడా పడింది. అలాగే, ఏప్రిల్ 10న గురువారం జైనమత 24వ తీర్థంకరుడు భగవాన్ మహావీర్ జయంతిని పురస్కరించుకొని బ్యాంకులకు సెలవును ప్రకటించారు. ఏప్రిల్ 12 రెండవ శనివారం, ఏప్రిల్ 13న ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులపాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఏప్రిల్ 14 న రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బ్యాంకుకు సెలవు ప్రకటించారు. ఏప్రిల్ 20 ఆదివారం కావడంతో సెలవు లభించింది. ఏప్రిల్ 26న నాలుగో శనివారం, ఏప్రిల్ 27న ఆదివారం కావడంతో వరుసుగా రెండు రోజులు పాటు బ్యాంకులకు సెలవులు మంజూరయ్యాయి. సెలవు రోజుల మినహా మిగిలిన రోజుల్లో బ్యాంకుల సేవలను వినియోగించుకోవడం ద్వారా అత్యవసర పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవచ్చు. ఈ సెలవులు పట్ల రోజువారి బ్యాంకు అవసరాలు కలిగి ఉండేవారు అవగాహన కలిగి ఉండాలని పలువురు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్