వరంగల్ లో ఇద్దరిని చంపిన మావోయిస్టులు.. వీరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి

వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మావోయిస్టులు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరినీ హత మార్చారు. తెలంగాణ - చతిష్ఘడ్ సరిహద్దు ప్రాంతంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇన్ ఫార్మర్ గా భావించి పంచాయతీ కార్యదర్శితోపాటు అతని తమ్ముడిని మావోయిస్టులు గురువారం అర్ధరాత్రి తర్వాత హత్య చేశారు. ఈ హత్యలు కలకలం సృష్టించాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీలో పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేష్, ఆయన తమ్ముడు అర్జున్ ను మావోయిస్టులు హత్య చేశారు.

Ramesh, letter

మృతి చెందిన రమేష్, లేఖ

వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మావోయిస్టులు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరినీ హత మార్చారు. ఉనికి కోసం గత కొన్నాళ్లుగా మావోయిస్టులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇన్ ఫార్మర్లుగా భావించిన ఇద్దరిని హత్య మార్చారు. తెలంగాణ - చతిష్ఘడ్ సరిహద్దు ప్రాంతంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇన్ ఫార్మర్ గా భావించి పంచాయతీ కార్యదర్శితోపాటు అతని తమ్ముడిని మావోయిస్టులు గురువారం అర్ధరాత్రి తర్వాత హత్య చేశారు. ఈ హత్యలు కలకలం సృష్టించాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీలో పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేష్, ఆయన తమ్ముడు అర్జున్ ను మావోయిస్టులు హత్య చేశారు. మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు అందిస్తున్నారని అనుమానంతో అర్ధరాత్రి అన్నదమ్ములను నరికి చంపారు. వీరిద్దరిని చంపినచోట ఒక లేఖను కూడా మావోయిస్టులు వదిలిపెట్టి వెళ్లారు. అన్నదమ్ముల హత్యతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 

ఒకవైపు తెలంగాణ - చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. నిఘాను కూడా పెంచాయి. ఇటువంటి తరుణంలో మావోయిస్టులో ఇద్దరినీ హత్య చేయడం సంచలనంగా మారింది. సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర నిర్బంధం కొనసాగుతున్నప్పటికీ గ్రామంలోకి వచ్చిన మావోయిస్టులు ఇద్దరిని హత్య చేసి వెళ్లిపోవడం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఘటనపై విచారణను వేగవంతం చేశారు. పోలీసు ఇన్ ఫార్మర్లుగా మారిన రమేష్, అర్జున్ వారికి తమస్ పార్టీకి సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారని అక్కడ విడిచిపెట్టి వెళ్లిన లేఖలో పేర్కొన్నారు. గ్రామంలో ఉంటూ పార్టీ కార్యకర్తలు, లీడర్ల కదలికలను వారి అనుచరుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. సేకరించిన విషయాలను మండల సెంటర్ కు వెళ్లే పోలీసులకు అందిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.

ఎస్ఐబి కంట్రోల్ లోకి వెళ్లి పనిచేస్తూ చతిస్గడ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు సమాచారం సేకరిస్తున్నారని పేర్కొన్నారు. లంకపిల్ల, ఉన్నప్ప, ఊట్ల, శ్యానుల దొడ్డి, వై పేట గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల బంధువులు, స్నేహితులు ద్వారా సమాచారం సేకరించి పోలీసులకు చేర వేస్తున్నారని లేఖలో వివరించారు. ఈ సమాచారం వల్లే మావోయిస్టులపై పోలీసులు దాడులకు కారణమైనట్లు భావించారు. అనంతరం రమేష్ కు ఉద్యోగం వచ్చి వాజేడు మండలంలో ఉంటున్నాడని, షికారు, చేపల వేట, పశువులు మేపడం పేరుతో అడవిలోకి వెళ్లి సమాచారం సేకరిస్తూ పోలీసులకు చెబుతున్నాడని పేర్కొన్నారు. పెనుగోలు గ్రామస్తులు గొట్టపైన ఉండొద్దని ఒత్తిడి చేసి దింపారని లేఖలో వివరించారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించిన వినలేదని, అందుకే రమేష్ ను హత్య చేశామన్నారు. వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఈ లేఖను విడుదల చేశారు. మావోయిస్టులు చేసిన ఈ హత్యలతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఆందోళన నెలకొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్