చరిత్ర సృష్టించిన మనుబాకర్‌.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌కు చెందిన షూటర్‌ మను బాకర్‌ చరిత్ర సృష్టించారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండో ప తకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. స్వాతంత్ర్యానంతరం ఒకే ఒలింపిక్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా మనుబాకర్‌ రికార్డు సృష్టించింది. రెండు రోజులు కిందట పది మీటర్లు ఎయిర్‌ రైఫిల్‌ ఫిస్టల్‌ సింగిల్స్‌ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించి భారత్‌ పారిస్‌ ఒలింపిక్‌లో తొలి మెడల్‌ అందించిన మనుబాకర్‌.. తాజాగా మంగళవారం మరో పతకాన్ని సాధించి సత్తా చాటింది.

Manubakar and Sarabjyoti

పతకం సాధించిన మనుబాకర్‌, సరబ్‌జ్యోతి జోడీ

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌కు చెందిన షూటర్‌ మను బాకర్‌ చరిత్ర సృష్టించారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండో ప తకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. స్వాతంత్ర్యానంతరం ఒకే ఒలింపిక్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా మనుబాకర్‌ రికార్డు సృష్టించింది. రెండు రోజులు కిందట పది మీటర్లు ఎయిర్‌ రైఫిల్‌ ఫిస్టల్‌ సింగిల్స్‌ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించి భారత్‌ పారిస్‌ ఒలింపిక్‌లో తొలి మెడల్‌ అందించిన మనుబాకర్‌.. తాజాగా మంగళవారం మరో పతకాన్ని సాధించి సత్తా చాటింది. పది మీటర్ల ఎయిర్‌ ఫిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించి సత్తా చాటింది. మనుతోపాటు సరబ్‌ జ్యోత్‌ సింగ్‌ కూడా ఈవెంట్‌లో పాల్గొన్నారు. మనుబాకర్‌, సరబ్‌ జ్యోత్‌ సింగ్‌ జోడీ కొరియాకు చెందిన వన్హో, ఓహ్‌ యే జిన్‌తో తలపడి ఓడించారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ జోడీ 16-10 స్కోరుతో విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. సింగిల్‌ ఈవెంట్‌లో కొరియా జోడీ ఓయ్‌ జిన్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించింది. 

మ్యాచ్‌ ముగిసిన తరువాత మనుబాకర్‌, సరబ్‌జ్యోత్‌ సింగ్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇది భారత అథ్లెట్లకు కష్టతరమైన ఆట అని, అయినప్పటికీ సత్తా చాటడం ఆనందంగా ఉందని సరబ్‌జ్యోత్‌ సింగ్‌ పేర్కొన్నారు. భారత దేశ ప్రజలకు, ఆశీర్వాదాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మనుభాకర్‌ కూడా తాజా పతకం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసింది. వరుసగా రెండో పతకాన్ని సాధించడం పట్ల సంతోషాన్ని వెలుబుచ్చింది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్