అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా మాజీ అధ్యక్షులు ట్రంప్, కమలహరిస్ పోటీపడుతున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓట్లు కీలకంగా మారాయి. సంఖ్యాపరంగా చూస్తే ఓటర్లు భారీగానే ఉండడంతో అగ్ర నాయకులు భారతీయ అమెరికన్లపై దృష్టి సారించారు. వీరి మనసు గెలుచుకునే ప్రయత్నాల్లో సదరు నేతలు ఉన్నారు. నానాటికి భారతీయ అమెరికన్ల ప్రభావం పెరుగుతుండడం వలన విస్మరించే పరిస్థితి లేకుండా పోయింది.
ట్రంప్, కమలహరిస్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా మాజీ అధ్యక్షులు ట్రంప్, కమలహరిస్ పోటీపడుతున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓట్లు కీలకంగా మారాయి. సంఖ్యాపరంగా చూస్తే ఓటర్లు భారీగానే ఉండడంతో అగ్ర నాయకులు భారతీయ అమెరికన్లపై దృష్టి సారించారు. వీరి మనసు గెలుచుకునే ప్రయత్నాల్లో సదరు నేతలు ఉన్నారు. నానాటికి భారతీయ అమెరికన్ల ప్రభావం పెరుగుతుండడం వలన విస్మరించే పరిస్థితి లేకుండా పోయింది. రెండు ప్రధాన పార్టీలు కూడా భారతీయ అమెరికన్ల ఓట్లను దక్కించుకునేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ట్రంప్ దీపావళి వేడుకల్లో పాల్గొని భారతీయ అమెరికన్ల ఓట్లర్ల మనసును గెలుచుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ మూలాలు ఉన్నవారు కీలకపాత్ర పోషిస్తున్నారు. కేవలం ఓటర్లుగానే కాకుండా రాజకీయ నేతలుగా, అభ్యర్థులుగా, ఓటర్లను సమీకరించి శక్తులుగా, నిధులు సమీకరించే వారిగా ఇలా అనేక అంశాల్లో భారతీయ అమెరికన్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. అమెరికా మొత్తం ఓటర్లలో భారతీయ అమెరికన్ల ఓట్లు దాదాపు 20 లక్షలు ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికను మలుపు తెప్పగల సామర్థ్యం ఉన్న స్వింగ్ రాష్ట్రాల్లో భారతీయ జనాభా అధికంగా ఉంది. స్వింగ్ స్టేట్స్ గా పిలిచే.. పెన్సిల్వేనియా, ఆరిజోనా, నవడా, జార్జియా, మిషిగన్, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లోని ఉన్న దక్షిణాసియా ఓటర్లలో ఇండియన్లు అత్యధికంగా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తేల్చడంలో అత్యంత కీలకమైన పెన్సిల్వేనియా రాష్ట్రంలో బక్స్ కౌంటిలో భారతీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. మిషిగన్, జార్జియా రాష్ట్రాల్లోనూ భారతీయ ఓటర్లు భారీ గానే ఉన్నారు. దీంతో భారతీయ ఓటర్ల ఓట్లను దక్కించుకునేందుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరు నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆయా అసోసియేషన్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇకపోతే భారతీయ అమెరికన్ల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు కూడా ఆయా పార్టీలకు అందుతున్నాయి. భారతీయ అమెరికన్ల సగటు వార్షిక ఆదాయం 1.45 లక్షల డాలర్లుగా ఉంది. ఇది అమెరికన్లతో పోలిస్తే 21 శాతం ఎక్కువ.
హారిస్ కు కాలిఫోర్నియాలో ఇటీవల ఒక్క వారంలోనే ఏకంగా 5.5 కోట్ల డాలర్ల విరాళాలు అందాయి. వీటిలో ఎక్కువ మొత్తం భారతీయ అమెరికన్ల నుంచే వచ్చాయి. డెమోక్రటిక్ పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చిన జాబితాలో 60 మందికి పైగా ఇండియన్ అమెరికన్లు ఉన్నారు. అక్కడి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న భారతీయుల సంఖ్య యాట పెరుగుతోంది. సేనేట్, ప్రతినిధుల సభతోపాటు రాష్ట్రాల సెనెట్లు, అసెంబ్లీ, సిటీ కౌన్సిల్, స్కూల్ బోర్డులకు ప్రాతనిద్యం వహిస్తున్న జిల్లాల అటార్నీలుగా నియమితులవుతున్న భారతీయ మూలాలున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇరు అభ్యర్థుల వైపు భారతీయ అమెరికాలో గట్టిగానే నిలబడ్డారు. అమెరికాలోని దక్షిణాసియా కు చెందిన 48 లక్షల మందికి పైగా యువ వాటర్లను ప్రభావితం చేయడంలో భారతీయులు కీలకంగా మారినట్లు సర్వేలు చెబుతున్నాయి. గత రెండు అధ్యక్ష ఎన్నికల్లోను భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో ఓట్లు వేసినట్లు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. 2020 ఎన్నికల్లో 71% ఇండో అమెరికన్లు ఓట్లేశారు ఈసారి 91 శాతం మంది ఓటు వేసే అవకాశాలు ఉన్నాయని ఆసియన్ అమెరికన్ ఓటర్ సర్వే అంచనా వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో దాదాపు 55 శాతం మంది డెమొక్రటిక్ పార్టీకి మద్దతిస్తున్నట్లు చెబుతున్నారు 25 శాతం మంది రిపబ్లికన్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. మరో 15 శాతం మంది స్వతంత్రులకు మద్దతుగా నిలువగా, మిగిలిన వారు తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సర్వేలు చెబుతున్నాయి.